
అయోధ్య: రామ మందిరంలో 22న రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. అతి త్వరలో జరగనున్న ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి సీతారాములు, లక్ష్మణుడు బుధవారమే అయోధ్యకు చేరుకున్నారు.
అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే వచ్చింది సీతారామలక్ష్మణులే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ సీరియల్ అయిన రామాయణ్‌లో నటించిన అరుణ్ గోవిల్(రాముడు), దీపిక చిక్లియా(సీత), సునీల్ లహ్రీ(లక్ష్మణుడు) రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు విచ్చేశారు.
ఇంతేకాక సోను నిగమ్ పాడిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాట చిత్రీకరణలో వీరు పాల్గొననున్నారు. అయోధ్యలోని గుప్తార్‌ఘాట్, హానుమాన్‌గర్హి, లతాచౌక్‌లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాలందిన వారిలో రామాయణ్ సీరియల్ నటులు కూడా ఉన్నారు.