
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజానీకం ఇంటికే పరిమితమైంది. ఈ లాక్‌డౌన్ సమయాన్ని వినోదంతో నింపేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీరందిరినీ బుల్లితెర వైపు తిప్పుకునేందుకు అనేక ఛానళ్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో అత్యంత ప్రజాధరణ పొందిన సీరియళ్లు, షోలను తిరిగి ప్రసారం చేస్తున్నారు. అయితే అందరి అంచనాలను మించి దూరదర్శన్‌లో ప్రసారం అవుతున్న రామయణం సీరియల్‌కు విశేష ప్రేక్షకాధరణ లభిస్తోంది. ప్రతి రోజు కొన్ని కోట్లలో ఈ సీరియల్‌ను వీక్షిస్తున్నారు. రామాయణం ఇంత బిగ్గెస్ట్ హిట్ సాధించడంతో తెరపైకి ఓ డిమాండ్ వచ్చింది.
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి రామాయణం చిత్రాన్ని తెరకెక్కించాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా RajamouliMakeRamayan అనే హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహాభారతం రూపొందించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రామయణ చిత్రం కూడా తీస్తే భావి తరాలకు గుర్తిండిపోయే చిత్రమవుతుందని నెటిజన్లు ఆశపడుతున్నారు. ‘సర్ దయచేసి రామయణాన్ని తెరకెక్కించండి’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరి రామాయణం గురించి రాజమౌళి మనసులో ఏముందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.
చదవండి:
భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ
బన్ని భారీ ఫైట్.. ఖర్చెంతో తెలుసా?