రవి ఉడయార్, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్, మధు మంతెన, నితీష్ తివారి
చిన్నప్పటి నుంచి రామాయణాన్ని, అందులోని పాత్రలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అందులో కొన్ని ఘట్టాలను పలు పౌరాణిక సినిమాల్లో చూశాం. ఇప్పుడు పూర్తి స్థాయి రామాయణాన్ని 3డీలో తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉడయార్ ఈ లైవ్ యాక్షన్ 3డీ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. గతంలో 40 కోట్ల భారీ (అప్పటి మార్కెట్ వాల్యూ) బడ్జెట్‌తో ‘మగధీర’, బాలీవుడ్ మొదటి వంద కోట్ల చిత్రం ‘గజిని’ నిర్మించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ భారీ రామాయణానికి ఓ నిర్మాత కావడం విశేషం.
ఇప్పుడు 1500కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ సంస్థ ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రాతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మధు మంతెన నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారు. ‘‘మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ నటులు నటించనున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ‘రామాయణ్’ని రూపొందించబోతున్నాం. మూడు భాగాలుగా తెరకెక్కబోయే ఈ చిత్రం మొదటి భాగం 2021లో రిలీజ్ కానుంది. ఒక్కో భాగానికి 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించనున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment