కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం | Dipika Chikhlia ​Shares Her Mother Deceased heartBreaking Note | Sakshi
Sakshi News home page

రామాయణ్‌ నటి దీపిక తల్లి మృతి

Published Sun, Sep 13 2020 2:50 PM | Last Updated on Sun, Sep 13 2020 3:27 PM

Dipika Chikhlia ​Shares Her Mother Deceased heartBreaking Note - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్‌’ ధారవాహికలో సీతగా నటించిన నటీ దీపికా చిఖాలియా కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. శనివారం ఆమె తల్లి మృతి చెందారు. దీపకా తన తల్లి మరణించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన తల్లిలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం. ఆ దుఖం నుంచి బయటకు రావటం అంత సులభం కాదు. అమ్మా మీ అత్మకు శాంతి కలగాలి’ అని కామెంట్‌ చేశారు. సోషల్‌ మీడియోలో చాలా యాక్టివ్‌గా ఉండే దీపికా చిఖాలియా.. కొన్ని నెలల క్రింతం తన తల్లిదండ్రులతో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

‘అమ్మా, నాన్న, నేను.. మా కుటుంబానికి సంబంధించిన ఫొటో ఆల్బమ్‌లో నేను ఎంతో ఇష్టంగా పంచుకోవాలనుకునే ఫొటో ఇది. మా అమ్మకి చీరలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఆమె తరచు చీరలు ధరించడానికే ఆసక్తి చూపేవారు. అదే విధంగా ఆమె వివిధ రకాల ఫర్స్‌లను కూడా ఇష్టపడేవారు. అందుకే నేను చాలా ఇష్టంగా పలు రకాల పర్స్‌లను సేకరించడం అలవాటుగా మార్చుకున్నాను. ఈ ఫొటో నా సోదరి పుట్టక ముందు బరోడా(వడోదరా)లో దిగినది’ అని కాప్షన్‌ జత చేశారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యాన్ని దృశ్యంగా మలచిన ‘రామాయణ్’‌ ధారవాహిక ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ దృశ్యకావ్యంలో అరుణ్‌ గోవిల్‌ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా నటించిన విషయం తెలిసిందే.

Mum 🙏 RIP

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement