deepika chikhalia
-
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం
సాక్షి, న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్’ ధారవాహికలో సీతగా నటించిన నటీ దీపికా చిఖాలియా కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. శనివారం ఆమె తల్లి మృతి చెందారు. దీపకా తన తల్లి మరణించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన తల్లిలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కన్న తల్లిని కోల్పోవడం చాలా బాధకరం. ఆ దుఖం నుంచి బయటకు రావటం అంత సులభం కాదు. అమ్మా మీ అత్మకు శాంతి కలగాలి’ అని కామెంట్ చేశారు. సోషల్ మీడియోలో చాలా యాక్టివ్‌గా ఉండే దీపికా చిఖాలియా.. కొన్ని నెలల క్రింతం తన తల్లిదండ్రులతో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘అమ్మా, నాన్న, నేను.. మా కుటుంబానికి సంబంధించిన ఫొటో ఆల్బమ్‌లో నేను ఎంతో ఇష్టంగా పంచుకోవాలనుకునే ఫొటో ఇది. మా అమ్మకి చీరలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఆమె తరచు చీరలు ధరించడానికే ఆసక్తి చూపేవారు. అదే విధంగా ఆమె వివిధ రకాల ఫర్స్‌లను కూడా ఇష్టపడేవారు. అందుకే నేను చాలా ఇష్టంగా పలు రకాల పర్స్‌లను సేకరించడం అలవాటుగా మార్చుకున్నాను. ఈ ఫొటో నా సోదరి పుట్టక ముందు బరోడా(వడోదరా)లో దిగినది’ అని కాప్షన్ జత చేశారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యాన్ని దృశ్యంగా మలచిన ‘రామాయణ్’ ధారవాహిక ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా నటించిన విషయం తెలిసిందే. View this post on Instagram Mum 🙏 RIP A post shared by Dipika (@dipikachikhliatopiwala) on Sep 11, 2020 at 9:14pm PDT -
ప్రాణ భయంతో పరుగులు పెట్టాం: నటి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా 80లనాటి పాపులర్ సీరియల్ రామాయణ మళ్లీ ప్రజల ముందుకొచ్చింది.. బాగా పాలపులర్ కూడా అయింది. అందులో నటించిన ప్రధాన పాత్రధారులు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా షూటింగ్ విశేషాలను, తమ అనుభవాలను పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా రామాయణలోని సీత పాత్రధారి దీపికా చిఖ్లియా సీరియల్ షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ మర్చిపోలేని అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అనంతరం ‘‘ఈ దృశ్యాల వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే! మేమా సమయంలో మర్రి చెట్టు కింద షూటింగ్ చేస్తూ బిజిగా ఉన్నాం. నేను, రాముడు, లక్ష్మణుడు డైలాగులను నేర్చుకుంటున్నాం. అంతా మామూలుగానే ఉంది. ( ‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) అంతలోనే కెమెరామెన్ అజిత్ నాయక్ అక్కడికి వచ్చారు. ఆ వెంటనే ‘‘మీరు దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి. చెట్టుకింద నిలబడొద్దు’’ అని అన్నారు. ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన చెట్టుకింద ఉన్న మిగితా వారిని కూడా పక్కకు వెళ్లిపొమ్మన్నారు. డైరెక్టర్ సాగర్ గారు కూడా ఏం జరుగుతోందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. ఆ వెంటనే చెట్టుమీద ఉన్న పెద్ద పామును ఆయన గమనించారు. ఆ తర్వాత అందరం ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టాం’’ అంటూ చెప్పుకొచ్చారు. ( రామాయణంపై మిమ్స్.. నటుడిపై నెటిజన్ల ఫైర్) View this post on Instagram There is a story behind this scene ....so I shared ...we were busy with the shoot, learning lines and so on...the day was as normal as could be, after the scene got over our cameraman Ajit naik (cinematography) came to tell us please vacate the place and don’t stand underneath the tree and we were wondering all the three actors as to what was the hurry and why so abrupt ...he asked all the technicians also to clear the field ..sagar Saab was also wondering what happened ...and then he pointed out to a huge fat snake on the tree and what followed after that was we all RAN for our life🤣 sooo many memories 😊....#memories#ramayan#sagarworld# tree#banyantree#snake#fear#phobia#umbergoan#studio#sets#actors#actress#costume A post shared by Dipika (@dipikachikhliatopiwala) on Jun 11, 2020 at 7:21pm PDT -
‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’
.‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. టీవీ రామాయణంలోని సీతమ్మ.. దీపికా చికాలియా మొదటిసారి అతడిని 1983 నాటి తన తొలిచిత్రం ‘సున్ మేరీ లైలా’ షూటింగ్ లో చూశారు. మళ్లీ 1991 ఏప్రిల్ 28న అతడిని చూశారు. ఆరోజు అతడి పక్కన ఇద్దరికీ తెలిసిన వాళ్లెవరో ఉన్నారు. ఆ ఎవరో వెళ్లిపోయాక వీళ్లిద్దరే ఉన్నారు. రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు. తర్వాత రెండు గంటలు మాట్లాడుకున్నారు! ఏం మాట్లాడుకున్నారో దీపికా చికాలియా చెప్పడం లేదు కానీ, పెళ్లి చేసుకుందామని ఆ రెండు గంటల్లోనే ఇద్దరూ డిసైడ్ అయిపోయారట. లాక్డౌన్ తీరిక ఇంటర్వ్యూలో ఈ సంగతి బయట పెట్టారు చికాలియా. ఆమె భర్త హేమంత్ టోపీవాలానే ఆనాటి ’అతడు’.. (సరోజినీ నాయుడుగా..) -
సరోజినీ నాయుడుగా...
స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి, స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నర్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. సరోజినీ నాయుడు పాత్రను దీపికా చిఖలియా పోషించనున్నారు. ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. ఆ తర్వాత నటిగా వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారామె. 1991లో ఎన్టీఆర్ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో చంద్రమతిగా నటించారు దీపిక. హిందీ, తమిళం, గుజరాత్ భాషల చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. సరోజినీ నాయుడు బయోపిక్ గురించి దీపిక మాట్లాడుతూ– ‘‘సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో సరోజినీగారి గురించి వెతికాను. నాకు కావాల్సినంత సమాచారం దొరకలేదు. రైటర్ ధీరజ్ మిశ్రా ఈ బయోపిక్ గురించి చెప్పారు. అయితే నేనింకా సైన్ చేయలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ధీరజ్ మిశ్రాయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ టాక్. -
ఇరువురు జానకీలు ఒక్కచోట చేరిన వేళ...
దూర్‌దర్శన్‌లో ధారవాహికలు ప్రారంభమయిన తొలి నాళ్లలో వచ్చిన సంచలనం ‘రామాయణ్’. వాల్మీకి మహర్షి రచించిన ఆ అపురూప కావ్యాన్ని దృశ్యంగా మలచి ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఎన్ని పనులున్నా ‘రామాయణ్’ ప్రసార సమయానికి మాత్రం టీవీల ముందు వాలిపోయేవారు. అంతలా జనాల్ని అలరించిన ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా అలరించింది . ‘రామాయణ్’లో వారు ప్రేక్షకులను ఎంతలా అలరించారంటే, వారనేదో టీవీ నటుల్లా కాక, దేవతా మూర్తులు ‘సీతారాముల్లా’నే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. నేటి కాలంలో కూడా పలు ఇతిహాసాలను తెరకెక్కితోన్నా, అలనాటి ‘రామాయణ్’ స్థానం ప్రత్యేకం. ఈ కాలం నటినటులతో 2008లో కూడా ‘రామాయణ్’ ధారావాహిక ప్రారంభమయ్యింది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇందులో బొన్నెర్జి సీతా దేవి పాత్రలో నటించింది. అయితే ఈ మధ్య ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ నాటి సీత దీపికా చిఖాలియా, ఈ నాటి సీత బొన్నెర్జిలు ఇద్దరు ఒక్క చోట చేరడం జరిగింది. ఇంకేముంది ఇద్దరు జానకీలను తమ కెమరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటి పడ్డారు. ఈ సందర్భంగా బొన్నెర్జి, చిఖలియాతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో పాటు ‘ఈ నాటి సీత, ఆ నాటి సీతను కలిసింది. చాలా అద్భుతమైన, అరుదైన సందర్భం. నేను రామాయణలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు మీ(చిఖాలియా) డీవీడీలను చూసి, అర్ధం చేసుకుని, తెలుసుకొని నటించాను. నిజంగా మీరోక లెజెండ్. ప్రేమతో’ అనే సందేశాన్ని పోస్టు చేశారు బొన్నెర్జి. ఇలా ఇద్దరు సీతలను ఒక్క చోట చూసిన అభిమానులు కూడా తెగ సంతోషిస్తున్నారు. వీరిద్దరి ఫోటోలను తెగ షేర్ చేస్తోన్నారు. When #Sita meets Sita ........ How I savoured this moment of meeting you @dipikkatopiwala my first work #ramayana was on the foundation of seeing your DVDs , understanding, forming knowledge. #legend................ lots of looooove. 🙏🏻🙏🏻🙏🏻 A post shared by Debina Bonnerjee (@debinabon) on Jul 29, 2018 at 2:07am PDT ఏనాటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనే ఇతివృత్తంతో వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణాన్ని సుభాష్ సాగర్, రామానంద్ సాగర్, ప్రేమ్ సాగర్లు నిర్మాతలుగా, రామానంద్, ఆనంద్ సాగర్, మోతీ సాగర్ దర్శకత్వంలో రామాయణ్‌ను తెరకెక్కించారు. దాదాపు 78 వారాలపాటు ప్రసారమయిన ఈ ధారావాహిక తొలి ఎపిసోడ్ 1986, జనవరి 25న ప్రారంభం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సీరియల్‌ను దాదాపు 65 కోట్ల మంది వీక్షించారు. -
రాముడు, సీత, రావణుడు.. అంతా ఒకటే పార్టీ!
రామాయణంలో సీతారాములు ఇద్దరూ ఒక చోట ఉంటారు కానీ, వాళ్లతో కలిసి రావణుడు ఉండటం ఎప్పుడైనా చూశారా? పురాణాలతో పాటు సినిమాల్లో కూడా ఎక్కడా అలా జరగదు కానీ.. రామానంద్ సాగర్ తీసిన సూపర్ హిట్ టీవీ సీరియల్ రామాయణంలోని రాముడు, సీత, రావణాసురుడు పాత్రధారులు ముగ్గురూ ఇప్పుడు ఒకటే పార్టీ.. బీజేపీలో ఉండబోతున్నారు. రావణాసురుడి పాత్ర ధరించిన అరవింద్ త్రివేదీ ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన గుజరాత్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే సీత పాత్రధారిణి దీపికా చికాలియా కూడా రెండుసార్లు బీజేపీ తరఫున గుజరాత్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా.. రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ సైతం బీజేపీలో చేరుతున్నారు. మహాభారతంలో ధర్మరాజు పాత్ర పోషించిన గజేంద్ర చౌహాన్ కూడా ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన ప్రస్తుతం పుణె ఫిలిం ఇన్స్టిట్యూట్ చైర్మన్‌గా ఉన్నారు. బీహార్ లేదా యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు అరుణ్ గోవిల్ బీజేపీలో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినా.. అరుణ్ గోవిల్ తిరస్కరించారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావడంతో పాటు.. బీజేపీలోనే చేరుతానని కూడా చెబుతున్నారు.