ప్రాణ భయంతో పరుగులు పెట్టాం: నటి | Dipika Chikhlia Recalled The Memories Of Ramayan Shooting | Sakshi
Sakshi News home page

ప్రాణ భయంతో పరుగులు పెట్టాం: రామాయణ సీత

Published Fri, Jun 12 2020 11:05 AM | Last Updated on Fri, Jun 12 2020 11:29 AM

Dipika Chikhlia Recalled The Memories Of Ramayan Shooting - Sakshi

దీపికా చిఖ్లియా

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 80లనాటి పాపులర్‌ సీరియల్‌ రామాయణ మళ్లీ ప్రజల ముందుకొచ్చింది.. బాగా పాలపులర్‌ కూడా అయింది. అందులో నటించిన ప్రధాన పాత్రధారులు అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా షూటింగ్‌ విశేషాలను, తమ అనుభవాలను పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా రామాయణలోని సీత పాత్రధారి దీపికా చిఖ్లియా సీరియల్‌ షూటింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఓ మర్చిపోలేని అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఆమె స్పందించారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. అనంతరం ‘‘ఈ దృశ్యాల వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే! మేమా సమయంలో మర్రి చెట్టు కింద షూటింగ్‌ చేస్తూ బిజిగా ఉన్నాం. నేను, రాముడు, లక్ష్మణుడు డైలాగులను నేర్చుకుంటున్నాం. అంతా మామూలుగానే ఉంది. ( ‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’)

అంతలోనే కెమెరామెన్‌ అజిత్‌ నాయక్‌ అక్కడికి వచ్చారు. ఆ వెంటనే ‘‘మీరు దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి. చెట్టుకింద నిలబడొద్దు’’ అని అన్నారు.  ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన చెట్టుకింద ఉన్న మిగితా వారిని కూడా పక్కకు వెళ్లిపొమ్మన్నారు. డైరెక్టర్‌ సాగర్‌ గారు కూడా ఏం జరుగుతోందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. ఆ వెంటనే చెట్టుమీద ఉన్న పెద్ద పామును ఆయన గమనించారు. ఆ తర్వాత అందరం ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టాం’’ అంటూ చెప్పుకొచ్చారు. ( రామాయణంపై మిమ్స్‌.. నటుడిపై నెటిజన్ల ఫైర్‌)
 

There is a story behind this scene ....so I shared ...we were busy with the shoot, learning lines and so on...the day was as normal as could be, after the scene got over our cameraman Ajit naik (cinematography) came to tell us please vacate the place and don’t stand underneath the tree and we were wondering all the three actors as to what was the hurry and why so abrupt ...he asked all the technicians also to clear the field ..sagar Saab was also wondering what happened ...and then he pointed out to a huge fat snake on the tree and what followed after that was we all RAN for our life🤣 sooo many memories 😊....#memories#ramayan#sagarworld# tree#banyantree#snake#fear#phobia#umbergoan#studio#sets#actors#actress#costume

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement