బాలీవుడ్ నటుడు, యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ఒక ఇంటర్యూలో తన చిన్నప్పుడూ రోజుకి ఏకంగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు పాలు తాడేవాడినని చెప్పారు. అందదువల్లే తాను జీర్ణ సమస్యలు ఫేస్ చేస్తున్నానని తెలిసిందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన నాన్న ధర్మేంద్రకి బహుమతిగా వచ్చిన ప్రత్యేక గాజు గ్లాస్ తన దగ్గర ఉండేదని, దానిలోనే పాలు తాగేవాడనని అన్నారు. ఇలా ఆ హీరోలా ప్రతి రోజూ అన్ని పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?. ఎదురయ్యే సమస్యలేంటీ తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.
బాబీ డియోల్ మాదిరిగా అంతలా పాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇలా పిల్లలు, పెద్దలు తీసుకుంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తారని అన్నారు. పాలు కాల్షియం, విటమిన్ డీ,ప్రోటీన్ మూలం. ఇవి ఎముకల పెరుగుదలకి, అభివృద్ధికి తోడ్పతుంది. అయితే అధికంగా తీసుకుంటే మాత్రం అధిక బరువు, లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదుర్కొనవల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
ఏంటి లాక్టోస్ అసహనం..?
పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల లాక్టోస్ ఎంజైమ్‌లు అధికంగా పని చేస్తాయి కాబట్టి శరీరంలో లాక్టోస్ ఎంజైమ్‌లలో క్షీణత ఏర్పడి ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ లాక్టోస్ అనేది పాలలో కనిపించే చక్కెర. ఇది లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతుంది.
ఓ వయసు వచ్చేటప్పటికీ శరీరంలో లాక్టేజ్ కార్యకలాపాలు తగ్గుతాయి. దీంతో లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్, డయేరియా, పొత్తికడుపు తిమ్మిరికి కారణమవుతుంది. ఈ లక్షణాలు రోజూవారీ జీవితాన్ని, మొత్తం ఆరోగ్యాన్ని గణనీయం ప్రభావితం చేస్తాయని వెల్లడించారు నిపుణులు.
వచ్చే ఆరోగ్య సమస్యలు..
ఎక్కువ పాలు తాగే పెద్దల్లో అధిక సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుంది.
పాలు కేలరీలు కలిగిన పానీయం. పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వులు పిల్లలలో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను కలుగజేసే అవకాశం ఉంది. కలిగిస్తుంది.
ఇలా పాలు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దారి తీస్తుంది.
అలాగే దీనిలోని అధిక కాల్షియం ఇతర ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అదీగాక చాలా పాడి పశువులకు హార్మోన్ల కాక్టెయిల్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇది పశువులలో వేగవంతమైన పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పైగా కృత్రిమంగా పాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఈ హార్మోన్లలో ఒకటి, IGF-1, అసాధారణ కణాల విభజన పెంచి, వివిధ కేన్సర్లు, మొటిమలు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు.
అందువల్ల ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సింది ఒక్కటే.. మితంగా పాలు తీసుకుంటే మంచి పోషకాలను, ప్రయోజనాలను పొందగలం. పోషకాల అసమతుల్యతను నివారించేలా పిల్లలు, పెద్దలు సమతుల్య ఆహారానికే ప్రాధాన్యతే ఇవ్వాలి. ముఖ్యంగా సంతృప్త కొవ్వును తగ్గించడం లేదా తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: ఆన్‌లైన్‌లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!)
Comments
Please login to add a commentAdd a comment