
పిచ్చి ప్రేమ...
కాజల్ ప్రేమలో పడ్డారండి. అది కూడా అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. క్రేజీగా పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నారట. ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో అనుకుంటున్నారా? హిందీ నటుడు బాబీ డియోల్. ఈ ఇద్దరికీ లవ్ కుదిరింది ఎక్కడో తెలుసా? ‘యామ్లా పగ్లా దీవానా’లో. ఈ టైటిల్ అర్థం క్రేజ్, మ్యాడ్ అని. ఈ సినిమాలోనే ఈ ఇద్దరూ లవర్స్‌గా నటిస్తున్నారు. అసలు విషయం అది.
ధర్మేంద్ర, బాబీ డియోల్, సన్నీ డియోల్ యాక్ట్ చేసిన ‘యామ్లా పగ్లా దీవానా’ చిత్రం 2011లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2013లో దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘యామ్లా పగ్లా దీవానా 2’ చిత్రం ఓ మోస్తారుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి.. బాబీ, కాజల్ నటించనున్న ‘యామ్లా పగ్లా దీవానా 3’ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. హిందీలో కాజల్‌కి పెద్దగా హిట్లు లేవు. ఆ కొరతను ఈ సినిమా తీర్చేస్తుందని బాలీవుడ్ వారు అంటున్నారు. స్క్రిప్ట్ అంత బాగుందట.