
పాడు కరోనా.. 2020లోనే దీని కథ కంచికి చేరుతుందనుకుంటే ఈ ఏడాది కూడా నీడలా వెంటాడుతూ అందరికీ చెమటలు పట్టిస్తోంది. ఈ కోవిడ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ మాస్కులతోనే దర్శనమిస్తున్నారు. షేక్ హ్యాండ్‌కు గుడ్‌బై చెప్తూ నమస్కారానికి ప్రతినమస్కారం చేస్తున్నారు. జన జీవనశైలినే మార్చేసిన ఈ మాయదారి కరోనా అంత ఈజీగా జనాలను వదిలేలా కనిపించడం లేదు. అయితే కరోనా నియంత్రణ కోసం పాటించే చర్యలను బాలీవుడ్ హీరో బాబీ డియోల్ 30 ఏళ్ల క్రితమే చెప్పినట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కరోనాను దూరం పెట్టేందుకు పాటించే చర్యలన్నింటినీ చూపించారు. ముఖ్యంగా బాబీ డియోల్ ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేస్తున్నట్లుగా నటి ఐశ్వర్యరాయ్ ముక్కులో బడ్ పెట్టడం, క్వారంటైన్‌కు వెళ్తున్నట్లుగా తలుపేసుకుని గదిలో ఉండటం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. బాబీ డియోల్ నటించిన కొన్ని సినిమాల్లోని క్లిప్పింగ్‌లను అన్నింటినీ చేర్చి ఈ వీడియోను క్రియేట్ చేశారు కొందరు మీమర్స్. మరి ఈ ఫన్నీ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..
చదవండి: ఛీఛీ.. ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా!
Comments
Please login to add a commentAdd a comment