
పూజా హెగ్డే
లండన్‌కి బై బై చెప్పారు కథానాయిక పూజా హెగ్డే. ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రం కోసం ఆమె లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, బొమన్ ఇరానీ, కృతీ సనన్, కృతీ కర్భందా, పూజా హెగ్డే ముఖ్య తారలుగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ బార్బర్ గెటప్‌లో కనిపిస్తారట. లండన్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో భాగంగానే ఫర్హాఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల మొదటివారంలో జైపూర్‌లో స్టార్ట్ కానుందని బీ టౌన్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.