Akshay Kumar Announces Housefull 5 - Sakshi

ఐదు రెట్ల వినోదం

Jul 1 2023 4:10 AM | Updated on Jul 31 2023 8:12 PM

Akshay Kumar announces Housefull 5 - Sakshi

బాలీవుడ్‌ కిలాడి అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లో ‘హౌస్‌ఫుల్‌’ మూవీ ఫ్రాంచైజీది ప్రత్యేక స్థానం. అక్షయ్‌లోని కామెడీ స్టైల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ‘హౌస్‌ఫుల్‌’ చిత్రాలే. ఇప్పటివరకూ ‘హౌస్‌ఫుల్‌’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన నాలుగు చిత్రాల్లో అక్షయ్‌ కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్‌లు నటించారు. తాజాగా ‘హౌస్‌ఫుల్‌ 5’ని ప్రకటించారు. ‘దోస్తానా’, ‘డ్రైవ్‌’ సినిమాలకు దర్శకత్వం వహించిన తరుణ్‌ మన్సుఖాని ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాను తెరకెక్కించనున్నారు. సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ‘‘ఐదు రెట్ల వినోదంతో ‘హౌస్‌ఫుల్‌ 5’ను 2024 దీపావళికి విడుదల చేయనున్నాం’’ అన్నారు అక్షయ్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement