రాజకుమారి మాలగా పూజ | Akshay Kumar Shared Pooja Hegde Character Poster From House Full 4 | Sakshi
Sakshi News home page

రాజకుమారి మాలగా పూజ

Published Wed, Sep 25 2019 4:06 PM | Last Updated on Wed, Sep 25 2019 4:06 PM

Akshay Kumar Shared Pooja Hegde Character Poster From House Full 4 - Sakshi

తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న  పూజా హెగ్డే రాజకుమారి మాల పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్‌ మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ మూవీ సిరీస్‌ హౌజ్‌ఫుల్‌. ఇప్పటికే ఈ సిరీస్‌లో విడుదలైన మూడు సినిమాలు ఘన విజయాలు సాధించగా తాజాగా మరో సీక్వెల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈసినిమాను మరింత భారీగా ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో సౌత్‌లో సూపర్‌ ఫాంలో ఉన్న పూజా హెగ్డే రాజకుమారి మాల, పూజ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. 15 శతాబ్దపు రాజకుమారికిగా రాయల్‌ లుక్‌తో పాటు 21వ శతాబ్దంలోని మోడ్రన్‌ అమ్మాయిగా మరో లుక్‌లో కనిపించనున్నారు పూజా. బుధవారం సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

అక్షయ్‌ కుమార్‌, రితేష్ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌, క్రితి సనన్‌, కృతి కర్బందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా సాజిద్‌ ఖాన్‌ను దర్శకుడిగా తీసుకున్నా  మీటూ ఆరోపణలు రావటంతో ఆయన్ను తప్పించి ఫర్హాద్‌ను తీసుకున్నారు. దీపావళి కానుకగా రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈసినిమా ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement