house full
-
థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’
బెంగళూరు: హౌస్‌ఫుల్ బోర్డులు మనం ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. కర్నాటకలో మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున కేసులు.. మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 217 మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో మరణాలు భారీగా చోటుచేసుకుంటుండడంతో శ్మశానాలన్నీ నిండుకుంటున్నాయి. మృతదేహాలు భారీగా చేరుకుంటుండడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో శ్మశాన వాటిక నిర్వాహకులు వాటికి అంత్యక్రియలు చేయలేకపోతున్నారు. ఖననం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ ఉండడం లేదు. దీంతో బెంగళూరులోని పలు శ్మశానవాటికలు ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డులు తగిలేస్తున్నాయి. చామ్‌రాజ్‌పేటలోని శ్మశాన వాటిక ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డు తగిలేసింది. శ్మశానంలో రోజుకు 20కి పైగా కరోనాతో మరణించిన మృతదేహాలు వస్తుండడంతో ఈ మేరకు శ్మశాన వాటిక నిర్వాహకులు బోర్డు పెట్టేశారు. బెంగళూరులో 13 విద్యుత్ దహన వాటికలు ఉండగా అవి నిరంతరం బిజీగా ఉంటున్నాయి. శ్మశానాల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ)కి 230 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వాటిలో అంత్యక్రియల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వం అంత్యక్రియలపై ఆలోచన చేసింది. మృతుల కుటుంబీకులే తమ సొంత ప్లాట్లు, ఫామ్‌హౌస్, పొలాలు ఉంటే అక్కడే ఖననం.. లేదా అంత్యక్రియలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం కర్నాటకలో కరోనా కేసులు 16 లక్షలు దాటాయి. కొత్తగా 37,733 కేసులు నమోదు కాగా, మరణాలు 217 సంభవించాయి. ఇవి అధికారికంగా ప్రకటించినవే. అనధికారికంగా ఎన్నో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర చదవండి: ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం -
పూర్తి సామర్థ్యంతో సినిమా హాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంద శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్–19 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు. కోవిడ్–10 ప్రోటోకాల్స్ పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటించాలని చెప్పారు. శానిటైజేషన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంలో సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఏఐ) స్వాగతించాయి. డిజిటల్‌కి గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం.. ఓటీటీల్లో విడుదలవుతున్న పలు వెబ్ సిరీస్‌లు, షోలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికలపై విడుదలయ్యే వెబ్‌సిరీస్‌లు, షోల నియంత్రణకు గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ‘‘ఓటీటీల్లో విడుదలవుతున్న కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే గైడ్‌లైన్స్ తీసుకొస్తాం’’ అని వెల్లడించారు. నియమావళిలోని ముఖ్యాంశాలు ► కంటైన్మెంట్ జోన్లలోని థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శనకు అనుమతి లేదు. ► క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు చర్యలకు సిఫార్సు చేయొచ్చు. ► థియేటర్లలో సీట్ల సామర్థ్యం వందశాతానికి పెంచుకోవచ్చు. ► సినిమా హాళ్లు, థియేటర్లలో కోవిడ్–19 సంబంధిత భద్రతా చర్యలను అమలు చేయాలి. ► ఫేస్ మాస్కుల వినియోగం తప్పనిసరి. ► థియేటర్ల బయట, కామన్ ప్రాంతాలు, వేచిఉండే ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► ఆరోగ్యసేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ► ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో రద్దీ లేకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ► సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమాల ప్రదర్శనల మధ్య తగినంత విరామం ఇవ్వాలి. ► టికెట్లు, ఆహారం, పానీయాల కొనుగోలులో చెల్లింపుల నిమిత్తం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి. ► టికెట్ల కొనుగోలు నిమిత్తం రోజంతా తెరచి ఉండేలా తగిన సంఖ్యలో బాక్సాఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా ముందస్తు బుకింగ్‌ను అనుమతించాలి. ► థియేటర్ల ప్రాంగణంలో శానిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► మానవ సంచారం ఉండే అన్ని చోట్లా హ్యాండిల్స్, రెయిలింగ్స్ తరచుగా శానిటైజ్ చేయాలి. ► థియేటర్లలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై ప్రకటనలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. -
ముద్దు పెట్టలేదని రిజెక్ట్ చేసింది: అక్షయ్
బాలీవుడ్లో సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు ఖిలాడి హీరో అక్షయ్ కుమార్. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. పూర్తిగా కమర్షియల్ చిత్రాలనే కాక.. తనలోని నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు కూడా చేస్తూ.. విజయవంతంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా హౌస్‌ఫుల్ 4 ప్రమోషన్లో భాగంగా అక్షయ్, కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్, రిజెక్షన్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అక్షయ్. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనతో కలిసి మూడు నాలుగు సార్లు డేట్‌కు వెళ్లాను. అంటే తనతో కలిసి సినిమాకు వెళ్లి అట్నుంచి అటే రెస్టారెంట్‌కి వెళ్లి భోంచేసే వాళ్లం. అయితే నాలో ఉన్న సమస్య ఏంటంటే నాకు చాలా సిగ్గు. తనతో బయటకు వెళ్లినప్పుడు ఆమె భుజం మీద చేతులు వేయడం.. తన చేతిని పట్టుకోవడం.. కిస్ చేయడం లాంటివి చేయలేదు. దాంతో ఆమె నన్ను రిజెక్ట్ చేసింది’’ అన్నారు. అయితే దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు ప్రపోజ్ చేయాలని ఆ అమ్మాయి భావించి ఉటుంది. కానీ మీరేమో ముద్దు పెట్టలేదు అందుకే వదిలేసింది అంటున్నారు.. బహుశా మీరే తప్పులో కాలేసిట్లున్నారు. అయినా మీకు ట్వింకిల్ లాంటి అందమైన భార్య లభించాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసింది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్) ఇక అక్షయ్-ట్వింకిల్ ఖన్నాల వివాహ బంధానికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. ‘‘నేను నీతో భాగస్వామ్యంలో ఉన్నాను... మనం ఇరవై సంవత్సరాల సమైక్యతకు చిహ్నంగా నిలిచాము. నువ్వు ఇప్పటికీ నా హృదయాన్ని కదిలిస్తావు.. నన్ను నడిపిస్తావు. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ నవ్వు నన్ను సేదదీరుస్తుంది. వార్షికోత్సవ శుభాకాంక్షలు టీనా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అక్షయ్ కుమార్. ఇక ప్రస్తుతం ఆయన బచ్చన్ పాండే చిత్రంలో నటిస్తున్నారు. -
రాజకుమారి మాలగా పూజ
తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న పూజా హెగ్డే రాజకుమారి మాల పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ హౌజ్‌ఫుల్. ఇప్పటికే ఈ సిరీస్‌లో విడుదలైన మూడు సినిమాలు ఘన విజయాలు సాధించగా తాజాగా మరో సీక్వెల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈసినిమాను మరింత భారీగా ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సౌత్‌లో సూపర్ ఫాంలో ఉన్న పూజా హెగ్డే రాజకుమారి మాల, పూజ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. 15 శతాబ్దపు రాజకుమారికిగా రాయల్ లుక్‌తో పాటు 21వ శతాబ్దంలోని మోడ్రన్ అమ్మాయిగా మరో లుక్‌లో కనిపించనున్నారు పూజా. బుధవారం సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, క్రితి సనన్, కృతి కర్బందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా సాజిద్ ఖాన్‌ను దర్శకుడిగా తీసుకున్నా మీటూ ఆరోపణలు రావటంతో ఆయన్ను తప్పించి ఫర్హాద్‌ను తీసుకున్నారు. దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. -
ఎట్టకేలకు అక్షయ్ సినిమా పూర్తైయింది!
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్‌ఫుల్4 చిత్రం షూటింగ్ పూర్తైయింది. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ సోషల్ మీడియాద్వారా ప్రకటించేశాడు. బాలీవుడ్లో చెలరేగిన మీటూ మంటలతో ఈ సినిమాపై గందరగోళం నెలకొంది. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన నానా పటేకర్, దర్శకుడు సాజిద్ నదియావాలాపై మీటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో.. చిత్రయూనిట్ వీరిద్దరిని హౌస్‌ఫుల్4 నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. బాలీవుడ్లో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తమ చిత్రాల్లోంచి బహిష్కరించడం మొదలుపెట్టారు మేకర్స్. అయితే నానా పటేకర్ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకున్నారు. అయితే సాజిద్ నదియావాలాను బహిష్కరించినట్లు ప్రకటించినా.. మిగిలిన భాగాన్ని కూడా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రితేష్ దేశ్‌ముఖ్, కృతి సనన్, కృతి కుర్బంధ, పూజా హెగ్డేలు నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. While we have called it a 'wrap’ for #Housefull4, fun never ends..See you all in 2019!@Riteishd @kritisanon @kriti_official @thedeol @hegdepooja @RanaDaggubati @ChunkyThePanday @farhad_samji #SajidNadiadwala @foxstarhindi @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/XVBV0uiio1 — Akshay Kumar (@akshaykumar) November 20, 2018 -
లండన్ టు జైపూర్
లండన్‌కి బై బై చెప్పారు కథానాయిక పూజా హెగ్డే. ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రం కోసం ఆమె లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, బొమన్ ఇరానీ, కృతీ సనన్, కృతీ కర్భందా, పూజా హెగ్డే ముఖ్య తారలుగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ బార్బర్ గెటప్‌లో కనిపిస్తారట. లండన్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో భాగంగానే ఫర్హాఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల మొదటివారంలో జైపూర్‌లో స్టార్ట్ కానుందని బీ టౌన్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
హౌస్ ఫుల్
-
కబాలి మానియా..
జిల్లా వ్యాప్తంగా థియేటర్లలో సందడి అభిమానుల్లో పండుగ వాతావరణం సప్తగిరికాలనీ: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా నేడు జిల్లావ్యాప్తంగా పలు థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ట్రైలర్, టీజర్లకు పెద్ద ఎత్తున స్పందన రాగా.. నేడు విడుదలకు సిద్ధమైంది. కొన్ని గంటల్లో సినిమా చూడనున్న అభిమానుల ఆనందోత్సవాలకు హద్దు లేకుండాపోయింది. కబాలి విడుదలకు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున థియేటర్ల యజమానులు ఏర్పాట్లుచేశారు. థియేటర్ల ముందు రజనీకాంత్ భారీ కటౌట్లను ఏర్పాటుచేశారు. మొత్తం నగరంలో ప్రతిమ మల్టిప్లెక్స్తోపాటు ఐదు థియేటర్లలో సినిమా విడుదలకానుంది. జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, హుజూరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, జమ్మికుంట, హుస్నాబాద్, కమలాపూర్, ముల్కనూర్‌లో భారీఎత్తున విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందు రోజు టికెట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటుచేయగా.. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడయ్యాయని పలువురు యజమానులు తెలిపారు. రెండు, మూడు రోజులు హౌస్‌ఫుల్ అయితే సుమారు కోటికి పైగా వ్యాపారం జరగవచ్చన్న అంచనాలు వేసుకుంటున్నారు. కబాలి సినిమాను చూసేందుకు జిల్లాలోని పలువురు సెలబ్రిటీలకు సైతం తాకింది. సినిమా చూసేందుకు ఇప్పటికే టికెట్లను బుక్ చేయించుకున్నారు.