![Farmers Stops Bobby Deol Love Hostel Shooting In Punjab - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/7/BOBBY-DEOL.jpg.webp?itok=bU0CKLsM)
షూటింగ్ స్పాట్ వద్ద నిరసనలు తెలియజేస్తున్న రైతులు
చండీగఢ్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కొత్త సినిమా ‘లవ్ హాస్టల్’ సినిమా షూటింగ్‌ను రైతులు అడ్డుకున్నారు. పంజాబ్‌లోని పటియాలాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. శుక్రవారం మెహాన్ గ్రామంలోని ఓ ఇంట్లో ‘లవ్ హాస్టల్’ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న దాదాపు 200 మంది రైతులు షూటింగ్‌ను అడ్డుకున్నారు. బాబీ డియోల్ కుటుంబం కానీ, అతడి సోదరుడు, బీజేపీ నాయకుడు, గుర్‌దాస్‌పూర్ ఎంపీ సన్నీ డియోల్ కానీ, రైతుల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ చేసుకోనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఇంటి ముందు భైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన చోటుచేసుకున్న సమయంలో బాబీ డియోల్ అక్కడ లేకపోవటం గమనార్హం.
చదవండి : పోర్న్ వీడియో రాకెట్: నటి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment