సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కంగువా’.. అన్ని కోట్లా? | Suriya Pan India Film Kanguva Made on A Huge Budget | Sakshi
Sakshi News home page

సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కంగువా’.. అన్ని కోట్లా?

Published Fri, Apr 26 2024 8:44 AM | Last Updated on Fri, Apr 26 2024 6:37 PM

Suriya Pan India Film Kanguva Made on A Huge Budget

కంగువా చిత్రం సౌండ్‌ సినీ వర్గాల్లో బాగా పెరిగిపో తోంది. నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీక్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న భారీ చిత్రం కంగువా. చారిత్రిక, సాంఘిక కథాంశాల ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మెట్‌లో తమిళం, తెలుగు, మలమాళం, కన్నడం, హిందీ తదితర 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రంలో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్‌ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్‌ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్‌ కింగ్‌స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

కాగా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కంగువ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బ్రహ్మాండమైన గ్రాఫిక్స్, సన్నివేశాలు చోటు చేసుకుంటాయని యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ఇకపోతే కంగువ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తాజా సమాచారం. నటుడు సూర్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement