
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎస్సీ ముఖ్యనేతల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం వెనుక సీఎం జగన్ కృషి ఉందని చెప్పారు. పేదలకు ఎంతగా ఉపయోగపడతాయో ఆలోచించి పథకాలు తెచ్చారని పేర్కొన్నారు.
'సామాన్యుల నుండి సానుకూల దృక్పథం ఉంది. సోషల్ మీడియా ద్వారా వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తాం. వీడియోలు చేసి పంపిస్తే వాటిని జనంలోకి తీసుకెళ్దాం. ధరలు దేశమంతటా పెరిగాయన్న విషయాన్ని సామాన్యులు సైతం మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఏపీలోనే పెరిగాయని ఎవరూ అనరు. మన ప్రత్యర్థులు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. మనం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినందున ధైర్యంగా జనంలోకి వెళ్తున్నాం.' అని సజ్జల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
చదవండి: ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది
Comments
Please login to add a commentAdd a comment