ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది | Sakshi
Sakshi News home page

ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది: ఆదిమూలపు సురేష్‌

Published Mon, Apr 24 2023 1:48 PM

YSRCP SC Chief Leaders Meeting In Tadepalli Updates - Sakshi

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, మేరుగు నాగార్జున, విశ్వరూప్‌, ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ఈ భేటీలో సజ్జల రామాకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, గురుమూర్తి కూడా పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఎస్సీలకు కొన్ని పథకాలు పెట్టి అవి కేవలం టీడీపీ కార్యకర్తలకు అందేలా చేసి అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉందని, వాటన్నింటినీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరిదిద్దిందని తెలిపారు.

'ఈరోజు ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు కల్గించేలా సంస్థాగత మార్పులు, సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాల్లో గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ అందించిన పరిపాలన మీద ఈరోజు చర్చించాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల మీద ప్రతిపక్షాలు వక్రభాష్యంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఈరోజు తీర్మానించాం.

ప్రధానంగా ఈ ప్రభుత్వం మూల సూత్రాలు జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలనను నాలుగు సంవత్సారాలుగా ఏ విధంగా అందిస్తున్నారనే విషయంపైనా చర్చించాం. రాబోయే రోజుల్లో ఎస్సీ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమకు అందుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే జగన్‌ను మరోసారి సీఎం చేయాల్సిన అవసరంపై కూడా చర్చించాం.' అని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

పార్టీల తీరు మారాలి: సజ్జల
సజ్జల మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీల తీరు మారాలన్నారు.  మన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.  ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని

Advertisement
Advertisement