వైరల్‌: ఏనుగు డాన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేం! | Elephant Dance To Namo Namo Ji Shankara Video Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఏనుగు డాన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేం!

Published Sat, Apr 17 2021 6:29 PM | Last Updated on Sat, Apr 17 2021 9:01 PM

Elephant Dance To Namo Namo Ji Shankara Video Viral - Sakshi

కేరళ: ఏనుగు అంటే అందరికీ భారీ కాయంతో గంభీరంగా ఉంటుందని గుర్తుకు వస్తుంది. అయితే కొన్ని ఏనుగులు సరదా పనులు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఏనుగులు రహదారులను దాటుతూ.. అడవిలో మరో జంతువును రక్షిస్తూ, కొన్ని సమయాల్లో తమకు ఆపద కలిగించే జంతువులను తరుముతూ కనిపించిన సందర్బాలు చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ ఏనుగు బాలీవుడ్‌ సినిమా పాటకు చేసిన నృత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘కేరళ ఎలిఫెంట్స్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘ఇది కర్ణాటకలోని కొడియాడ్కా ఆలయానికి చెందిన ఏనుగు ‘లక్ష్మీ’ చేసిన డాన్స్‌’ అని కామెంట్‌ కూడా జత చేసింది.

బాలీవుడ్‌ ‘కేదారానాథ్‌’ మూవీలోని ‘నమో నమోజీ శంకర’ అనే పాటకు ఈ ఏనుగు తన తల, తొండం, తోకను ఎంతో లయబద్ధంగా కదిలిస్తూ డాన్స్‌ను చేసింది. ఈ ఏనుగు నృత్యం వీడియోను సోషల్‌ మీడియాలో చూసిన నెటజన్లు సరదాగా కామెంట్లు చేసున్నారు. ‘చాలా జంతువులు నృత్యం చేసినప్పుడు చూశాం. కానీ ఈ ఏనుగు చేసిన వీడియోను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం’.. ‘వావ్‌ సూపర్‌! ఈ ఏనుగు నా కంటే చాలా బాగా డాన్స్‌ చేస్తోంది’..‘ఏనుగు పేరు లక్ష్మీ.. ఏనుగు నృత్యం అద్భుతం!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో ఈ వీడియోను వేల మంది వీక్షించగా.. ఐదు వేల మంది లైక్‌ చేశారు.
చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement