సూపర్‌ పవర్స్‌ చిన్నారి, వీడియో వైరల్‌! | Little Boy thinking his Super Powers Moving The Tree leaves Viral Video | Sakshi
Sakshi News home page

అద్భుత శక్తులతో చెట్ల ఆకులు ఊపుతున్న బాలుడు!

Published Tue, May 19 2020 2:29 PM | Last Updated on Tue, May 19 2020 3:02 PM

Little Boy thinking his Super Powers Moving The Tree leaves Viral Video - Sakshi

చిన్నప్పుడు పిల్లలకు ఏవేవో కథలు చెబుతూ ఉంటాం. అవి నిజమనుకొని పిల్లలు ఆ కథల్లోని పాత్రలను నిజ జీవితంలో ఊహించుకుంటూ ఉంటారు. ఆ కథలో వాళ్లకు బాగా నచ్చిన పాత్రలో తమని తాము ఊహించుకొని మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు కథలు చెప్పే కాలం పోయి పిల్లలందరికి టీవీలో కార్టూన్‌లు, యూ ట్యూబ్‌లో బొమ్మల కథలను చూపిస్తున్నాం. అయితే ఒక పిల్లాడు తాను చూసే బొమ్మల్లో ఒక పాత్రకు ఉండే సూపర్‌ పవర్స్‌ తనకి కూడా ఉన్నాయని అనుకుంటున్నాడు. ఒక చెట్టు దగ్గరికి వచ్చి తాను చేతులు కదపగానే చెట్టు ఆకులు కదలడాన్ని చూసి తనకున్న సూపర్‌ పవర్స్‌ వల్లే చెట్లు ఆకులు ఊగుతున్నాయని సంబరపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గాళ్ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..)

తాను చూసే కార్టూన్‌ పాత్రల్లో తనని తాను ఊహించుకుంటున్న ఒక పిల్లాడు తాను కూడా ఒక సూపర్‌ మ్యాన్‌ని అని అనుకున్నాడు. తనకున్న సూపర్‌ పవర్‌తోనే చెట్టు కొమ్మలు, ఆకులు ఊగుతున్నాయని తెగ సంబర పడిపోతున్నాడు. అసలు ఇంతకి ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ఆకుల్ని చూస్తూ చేతులు ఆడించగానే చెట్టు ఆకులు కదులుతున్నాయి. ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసి నా శక్తుల వల్లే ఆకులు కదులుతున్నాయని చెబుతాడు. దానికి వాళ్ల నాన్న కూడా నీ వల్లే అని తల ఊపుతాడు.నిజానికి ఆ చెట్టుకు కట్టిన ఊయలలో ఆ బాబు తండ్రి కూర్చోని పిల్లవాడు చేతులు కదపగానే ఊయలని కదుపుతున్నాడు. దీంతో ఆకులు కదులుతున్నాయి. అది తెలియని చిన్నారి తన శక్తుల వల్లే ఆకులు కదులుతున్నాయని మురిసిపోతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసి క్వారంటైన్‌ సమయంలో చిన్నారి తండ్రి పిల్లవాడికి ఎంతో కొంత ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని కొందరు భావిస్తుంటే మరి కొంతమంది పిల్లవాడిని అతని తండ్రి ఫూల్‌ చేస్తున్నాడు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.  (సర్ప్రైజ్ సూపర్!.. అట్టపెట్టెలో ఏముందంటే..)

Giving a little boy super powers from r/HumansBeingBros


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement