
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక బిజినెస్‌లో ఎంత బిజీగా ఉన్నప్పకీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యే ఆసక్తికరమైన వీడియోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఆయన ఓ వృద్దుడు చేసిన సాహసపూరితమైన స్టంట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఓ పార్క్‌లోని చిన్న పిల్లలు సరదాగా ఊగే ఉయ్యాల వద్ద ఓ పిల్లాడు ఉయ్యాలను పట్టకొని ఎలా ఊగాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పక్కనే మరో ఉయ్యాలో ఉన్న ఓ వృద్దుడు వేగంగా ఉయ్యాల ఊగుతూ ఒక్కసారిగా అలా గాలిలోనే పల్టీ కొట్టి ఉయ్యాల నుంచి కాళ్లు కిందపెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ‘ఉయ్యాలపై అద్భతంగా వేలాడాడు’ అంటూ హర్ష్ గోయాంక కామెంట్ జతచేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్దుడు చేసిన స్టంట్ వీడియోను పది లక్షల మంది వీక్షించగా, నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ప్రతి వృద్దుడిలో చిన్న పిల్లవాడు ఉంటాడు’, ‘అతను జిమ్నాస్టిక్ తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు’, ‘ఆయనకి చిన్నప్పుటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: చావు భయంతో ఏనుగు పరుగులు
Comments
Please login to add a commentAdd a comment