హర్ష గొయెంకా ట్వీట్‌.. హాట్‌ టాపిక్‌గా ఇస్రో చైర్మన్‌ జీతం.. | Harsh Goenka Post On ISRO Chief Somanath Monthly Salary Sparks Debate | Sakshi
Sakshi News home page

Harsh Goenka: హర్ష గొయెంకా ట్వీట్‌.. హాట్‌ టాపిక్‌గా ఇస్రో చైర్మన్‌ జీతం..

Published Tue, Sep 12 2023 7:39 PM | Last Updated on Tue, Sep 12 2023 7:58 PM

Harsh Goenka Post On ISRO Chief Somanath Monthly Salary Sparks Debate - Sakshi

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మార్పోగుతుంది. ఇందుకు కారణం ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష గోయెంకా. అవును సోమనాథ్‌ జీతం విషయాన్ని ట్విటర్‌ వేదికగా హర్ష గోయెంకా ప్రస్తావించడంతో ఇస్రో చైర్మన్‌ పేరు తీవ్ర చర్చకు దారితీసింది.

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. 

ఆయన తన ట్వీట్‌లో ‘ఇస్రో చైర్మన్ సోమనాథ్‌ నెల జీతం రూ. 2.50 లక్షలు. ఈ జీతం ఆయనకు సరైనదేనా? న్యాయమేనా? సోమనాథ్‌ లాంటి వాళ్లు డబ్బుల కోసం కాదు.. అంతకు మించిన మంచి, దేశ ప్రగతి కోసం పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చు. వారు సైన్స్‌, పరిశోధనల పట్ల అభిరుచి, నిబద్ధతతో జాతిని గర్వింపజేసేలా.. దేశ అభివృద్ధికి తోడ్పడతారు. వారి లక్ష్యాన్ని  సాధించడంలో వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేస్తారు. ఆయనలాంటి అంకితభావం గల వ్యక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను!’ అని పేర్కొన్నారు.

హర్ష గోయెంకా ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకమంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. సోమనాథ్‌కు ఎక్కువ సాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. మరికొంతమంది.రెండున్నర లక్షలు అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని, ఇతర అలవెన్సన్‌లు కూడా కలపాలని కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: ఎట్టకేలకు భారత్‌ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా

‘ఇస్రోకు సోమనాథ్‌ లాంటి వ్యక్తుల నిబద్ధత, ఎనలేనిది. డబ్బులతో పోల్చలేనిది. సైన్స్‌, రీసెర్చ్‌ పట్ల ఆయనకున్న అంకితభావం దేశాన్ని మరింత ముందుకు నడపుతోంది. ఆయనలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు అమూల్యమైనది’ అని ఓ యూజర్‌ పేర్కొనగా.. ‘ ఇస్రో చ్మైర్మన్‌కు  నెలకు 25 లక్షలు ఇవ్వాలి. తన ప్రతిభను గుర్తించి రివార్డ్ ఇవ్వాలని మరొకరు చెప్పారు. 

కాగా  ఇటీవల రెండు గొప్ప ప్రయోగాలను ఇస్రో చేపట్టిన  విషయం తెలిసిందే. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌-3 పేరుతో ఉపగ్రహాన్ని ప్రవేశించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేసింది.  అదే విధంగా సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు తొలిసారి ఆదిత్య ఎల్‌ల్‌1 పేరుతో అంతరిక్ష్యంలోకి మరో స్పేస్‌ క్రాఫ్ట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్‌ మిషన్‌అనంతరం భూమికి సూర్యుడికి మధ్యనున్న లాంగ్రేజ్‌ పాయింట్‌ 1 వద్దకు చేరుకొని సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement