లిసాసింగ్‌కు జ్ఞాపిక ఇస్తున్న కేటీఆర్. చిత్రంలో జయేశ్‌రంజన్
సాక్షి, హైదరాబాద్: ఐటీ, లైఫ్ సైన్సెస్, రెన్యువల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆస్ట్రేలియా–ఇండియా ఇన్‌స్టిట్యూట్ సీఈవో లిసాసింగ్ వెల్లడించారు. గురువారం ఇక్కడ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో లిసాసింగ్ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియా నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు.
భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని లిసాసింగ్ పేర్కొన్నారు. భారత్– ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా ఇక్కడ పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు త్వరలోనే ఒక ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటిస్తుందని చెప్పారు. ప్రగతిశీల తెలంగాణలో ఉన్న పరిస్థితులను ఆస్ట్రేలియా పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment