బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత సమస్య వేధిస్తోంది. మరోవైపు కర్బణ ఉద్ఘారాలు తగ్గించాలంటూ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండింటికి విరుగుడుగా కాలుష్య రహితంగా గ్రీన్ ఎనర్జీకి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే రోజుల్లో 50,000 మెగావాట్ల సోలార్ విద్యుత్, విండ్ పవర్ ద్వారా 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ ఇంజనీరింగ్ కంపెనీలో చర్చిస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment