న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. షేర్ల విక్రయం ద్వారా రూ. 12,300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) మార్గంలో నిధులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని మరో రెండు కంపెనీలు సైతం నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
క్విప్ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమకూర్చుకోనున్నట్లు ఇప్పటికే తెలియజేశాయి. ప్రధానంగా యూరప్, మధ్యప్రాచ్యం నుంచి ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నివేదిక వెలువడిన తదుపరి అదానీ గ్రూప్ కంపెనీలు పెట్టుబడుల సమీకరణ, కొత్త ప్రాజెక్టులతో విస్తరణకు తెరతీశాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచి్చన గ్రూప్ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు వీలుగా ముందస్తు రుణ చెల్లింపులకు ప్రాధాన్యమిస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment