న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగంలో మరింతగా వృద్ధి చెందడానికి, ప్రపంచానికే సరఫరాదారుగా ఎదగడానికి భారత్‌కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. పరికరాల దశ నుండి ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీల వరకూ పునరుత్పాదక ఇంధన సరఫరా వ్యవస్థను ఆసాంతం సమర్ధంగా నిర్వహించుకోగలిగేలా ఉండాలని పరిశ్రమకు ఆయన సూచించారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఐఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇంధన రంగానికి అవసరమైన నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) శిక్షణనివ్వాలని, మరింతగా టెక్నాలజీని వినియోగించాలని గోయల్ సూచించారు.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment