ఇంధన వినియోగాన్ని, దిగుమతులను తగ్గించుకోవాలని పలువురు నేతలు చెబుతూనే ఉన్నారు. దీని ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఎనర్జీ ఉపయోగించుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధికమంత్రి 'నిర్మలా సీతారామన్' భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 11వ స్నాతకోత్సవంలో ప్రస్తావించారు.
పునరుత్పాదక ఇంధన నిల్వలపై పరిశోధనలు ముమ్మరం చేయాలని సైన్స్ కమ్యూనిటీకి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. శిలాజ ఇంధనం నుంచి పునరుత్పాదక శక్తికి మారడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. అయితే దీనికి నిధులు ఇంకా రావాల్సి ఉందని ఆమె అన్నారు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి పునరుత్పాదక ఇంధన వనరులు చాలా అవసరం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దేశం గ్రీన్ ఎనర్జీ నిల్వలో అగ్రగామిగా ఉంది. కానీ సౌర శక్తిని నిల్వ చేసుకోవడానికి కావలసిన బ్యాటరీలు ప్రస్తుతం మనదగ్గర లేదు. వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్
సౌర శక్తిని నిల్వ చేసుకోవడానికి కావలసిన బ్యాటరీలు అందుబాటులోకి వచ్చే వరకు.. శిలాజ ఇంధనాలపైన ఆధారపడాలి. పెట్టుబడుల కోసం దేశం వేచి చూడదు, కాబట్టి శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేయాలి. అప్పుడే భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment