ఎయిర్‌టెల్ డేటా సెంటర్ విభాగమైన నెక్స్‌స్ట్రా అరుదైన ఘనత సాధించింది. కార్బన్ డిస్‌క్లోజర్ ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో క్లైమేట్ గ్రూప్ నేతృత్వంలోని ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌లో చేరింది. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తు వినియాగానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
నెక్స్‌స్ట్రా దేశవ్యాప్తంగా 12 పెద్ద, 120 ఎడ్జ్ డేటా సెంటర్లతో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ల నెట్వర్క్‌ను కలిగి ఉంది. "మాది పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన బ్రాండ్. క్లీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నాం. 2031 నాటికి మా నెట్ జీరో లక్ష్యాలను సాధించే దిశగా మేము ఆరోగ్యకరమైన మార్గంలో ఉన్నాం. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తుకు నిబద్ధతతో ఆర్ఈ 100 చొరవలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని ఎయిర్‌టెల్ నెక్స్‌స్ట్రా సీఈవో ఆశిష్ అరోరా ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్‌లో ఆర్‌ఈ 100 ఇనిషియేటివ్‌కు హామీ ఇచ్చిన ఏకైక డేటా సెంటర్ సంస్థగా, ఈ మైలురాయిని చేరుకున్న 14 వ భారతీయ సంస్థగా నెక్స్‌స్ట్రా నిలిచింది. కంపెనీ తన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచింది. ఇప్పటి వరకు 4,22,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఒప్పందాలను కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, క్యాప్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తిని సోర్సింగ్ చేయడం ద్వారా సుమారు 1,56,595 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లు నెక్స్‌స్ట్రా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment