న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించాలి్పన అవసరం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. బొగ్గు నుండి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లేందుకు దేశానికి మరింత సమయం పడుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, నేషనల్ డిటరై్మండ్ కాంట్రిబ్యూషన్స్ (ఎన్‌డీసీ) లక్ష్యాన్ని చేరుకోవడంలో భారతదేశం ఇతర జీ20 గ్రూప్ దేశాల కంటే చాలా ముందుందని అన్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ (1985–1900) స్థాయిలతో పోలిస్తే రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి వివిధ దేశాలు అనుసరించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికలను ఎన్‌డీసీలుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.
పేద దేశాలకు ఇబ్బందే..
అయితే అసలే కోవిడ్ ప్రతికూల ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ, తక్కువ వృద్ధి సాధిస్తూ, అప్పుల వలయంలో ఉన్న కొన్ని దేశాలకు ఎన్‌డీసీ లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారిందని నాగేశ్వరన్ అన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతామని కాప్28 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో చేసిన డిక్లరేషన్‌పై సంతకాలు చేయడానికి ఈ నెల ప్రారంభంలో భారత్, చైనాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దిశలో అడుగులు వేయాలన్న జీ20 నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ ఉద్ఘాటించింది.
పర్యావరణ పరిరక్షణపై దుబాయ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన చర్చల సందర్భంగా, 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు 118 దేశాలు ఉద్ఘాటించాయి. ఈ ప్రతిష్టాత్మక సమావేశం ప్రపంచంలోని మొత్తం శక్తి ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిక్లరేషన్‌కు మద్దతు ఇచి్చన దేశాల్లో జపాన్, ఆ్రస్టేలియా, కెనడా, చిలీ, బ్రెజిల్, నైజీరియా, బార్బడోస్ ఉన్నాయి. ఈ డిక్లరేషన్‌లో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడంతో పాటు పునరుత్పాదక ఇంధన ఉత్పత్లి పెంచడం కూడా కీలక అంశంగా ఉంది. నిరంతర బొగ్గు విద్యుత్‌ను దశలవారీగా తగ్గించాలని, కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిధులకు స్వస్తి పలకాలని కాప్28 సదస్సు ప్రతినబూనింది.
Comments
Please login to add a commentAdd a comment