సాక్షి, హైదరాబాద్: డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగదారులు విధిగా నిర్దేశిత మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) కొనుగోలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్–2021 ముసాయిదాను ప్రకటించింది. వచ్చే నెల 14లోగా దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. దీనిప్రకారం విధిగా గ్రీన్ ఎనర్జీ కొనుగోలు బాధ్యత (రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఆర్పీఓ)ను అందరిపై ఏకరీతిన ఉండనుంది.
డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్‌లకు ఈ నిబంధనలు తుది నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి వర్తించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కలిగి ఉన్నాయి. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఈ నిబంధనలను తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సొంతంగా పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ పెట్టుకోవచ్చు...
►తప్పనిసరి అయినా, కాకపోయినా ఏదైనా సంస్థ తమ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధనాన్ని దిగువ పేర్కొన్న ఏదైనా పద్ధతిలో కొనుగోలు చేసి వాడుకోవచ్చు.
►సొంత వినియోగం కోసం ఏర్పాటు చేసుకొనే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంపై ఎలాంటి పరిమితి ఉండకూడదు. అయితే విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయరాదు. దీనిని ‘బిహైండ్ ద మీటర్’వినియోగం అంటారు. ఈ విద్యుత్ కొనాల్సిన బాధ్యత డిస్కంలకు ఉండదు. ఈ విద్యుత్ ప్లాంట్‌ను సొంతంగా లేదా డెవలపర్ ద్వారా పెట్టించుకోవచ్చు. డెవలపర్‌తో దీర్ఘకాల/మధ్యకాల విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
►ఒప్పందం ద్వారా ఓపెన్ యాక్సెస్ విధానంలో డెవలపర్ నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని సమీకరించుకోవచ్చు.
కేంద్రం చేతిలో ఓపెన్ యాక్సెస్
ఓపెన్ యాక్సెస్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు అనుమతులు ఇకపై నేరుగా కేంద్రం నుంచి లభించనున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసే నోడల్ ఏజెన్సీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి సింగిల్ విండో విధానం ద్వారా సంబంధిత ఈఆర్సీలకు వాటిని పంపిస్తుంది. ఆ ఈఆర్సీ అనుమతులు ఇస్తుంది.
►ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాన్ని రాతపూర్వకంగా తెలపాలి.
పునరుత్పాదక విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేయవచ్చు...
►ఏదైనా సంస్థ తమ అవసరాల్లో కొంత శాతం మేరకు లేదా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను సమీకరించి సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విజ్ఞప్తి చేయవచ్చు.
►క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ లేదా ఓపెన్ యాక్సెస్ ద్వారా అందుబాటులో ఉన్న పునరుత్పాదక విద్యుత్‌ను రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేయవచ్చు.
►విధిగా కొనుగోలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తం/వాటాలో పునరుత్పాదక ఇంధ నాన్ని వినియోగదారులు స్వచ్ఛందంగా కొనుగోలు చేసుకోవచ్చు. కనీసం 50%, 75%, 100% పునరుత్పాదక ఇంధనాన్ని కొనొచ్చు.
►సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) పునరుత్పాదక విద్యుత్ టారిఫ్‌ను ఖరా రు చేస్తుంది. పునరుత్పాదక విద్యుత్ సమీకరణ సగటు ధర, క్రాస్ సబ్సిడీ చార్జీలు, సర్వీ సు చార్జీల ఆధారంగా టారిఫ్ నిర్ధారిస్తారు.
►పునరుత్పాదక విద్యుత్ కోసం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ చేసే విజ్ఞప్తి కనీసం ఏడాది కాలం కోసం ఉండాలి. ఏడాది పాటు కొంటామని ముందే సూచించాలి.
►డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ నుంచి వినియోగ దారులు కొనుగోలు చేసిన పునరుత్పాదక విద్యుత్‌ను, ఆ కంపెనీ విధిగా కొనుగోలు చేయాల్సిన విద్యుత్ (ఆర్బీఓ) కింద లెక్కి స్తారు. ప్రతినెలా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ సరఫరాను లెక్కిస్తారు.
►విధిగా కొనాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను అందుకోవడానికి రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.
►పునరుత్పాదక విద్యుత్ ఉపయోగించి ఉత్ప త్తి చేసిన ‘గ్రీన్ హైడ్రోజన్’ను పరిశ్రమలు, ఇతర సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా విధిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవచ్చు.
►ఓపెన్ యాక్సెస్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు వచ్చే దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలి. 100 కిలోవాట్స్, ఆపై కాంట్రాక్టెడ్ లోడ్, శాంక్షన్డ్ లోడ్ ఉన్న వినియోగదారులకు మాత్రమే ఓపెన్ యాక్సెస్ అనుమతి.
Comments
Please login to add a commentAdd a comment