దేశంలో తొలిసారిగా 10 వేల మెగావాట్ల సామర్థ్యం
న్యూఢిల్లీ: దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా తమ సంస్థ నిలి్చందని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. గుజరాత్‌లోని ఖావ్డా సోలార్ పార్క్‌లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది.
ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల పవన విద్యుత్, 2,140 మెగావాట్ల విండ్–సోలార్ హైబ్రిడ్ ప్లాంట్లు (మొత్తం 10,934 మెగావాట్ల ) ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment