![Reliance may earn 10-15 bn revenue from new energy biz by 2030 - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/19/REL.gif.webp?itok=N0L9pfCE)
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ .. పునరుత్పాదక ఇంధన వ్యాపారం ద్వారా 2030 నాటికి 1015 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే ఈ విభాగంలో పరిమిత స్థాయిలోనే అనుభవం ఉన్నందున.. సదరు రంగ కంపెనీలను కొనుగోలు చేయడం లేదా భాగస్వామ్యాలను కుదుర్చుకోవాల్సి రానుంది.
బ్రోకరేజ్ సంస్థ సాన్‌ఫోర్డ్ సి బెర్న్‌స్టీన్ ఈ మేరకు ఒక నివేదిక రూపొందించింది. స్వచ్ఛ ఇంధనమనేది (సౌర, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ మొదలైనవి) రిలయన్స్‌కు కొత్త వృద్ధి చోదకంగా నిలవనుందని నివేదిక తెలిపింది. 2050 నాటికి భారత్‌లో వీటిపై 2 లక్షల కోట్ల డాలర్ల పైగా పెట్టుబడులు రానున్నట్లు వివరించింది. 2030 నాటికి ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా 5 శాతానికి, ద్విచక్ర వాహనాల్లో 21 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది.
అప్పటికి మొత్తం స్వచ్ఛ ఎనర్జీ మార్కెట్ (టీఏఎం) 30 బిలియన్ డాలర్లుగా (ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని తెలిపింది. 2050 నాటికల్లా టీఏఎం 200 బిలియన్ డాలర్లకు, మొత్తం పెట్టుబడులు 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదిక పేర్కొంది. ‘2030 నాటికి రిలయన్స్ .. సౌర ఇంధన మార్కెట్లో 60 శాతం, బ్యాటరీలో 30 శాతం, హైడ్రోజన్ విభాగంలో 20 శాతం వాటా దక్కించుకోవచ్చు. ఈ కొత్త ఇంధనాల వ్యాపారంతో రిలయన్స్ 1015 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు..
► రిలయన్స్ ఇండస్ట్రీస్ శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా వైదొలిగే క్రమంలో సౌర, హైడ్రోజన్ ఇంధనాల వైపు మళ్లుతోంది. 2035 నాటికి కార్బన్ ఉద్గారాలకు సంబంధించి తటస్థ స్థాయికి చేరుకోవాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందుకోసం సౌర, బ్యాటరీలు, హైడ్రోజన్ వంటి విధానాల ద్వారా పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తి వ్యవస్థను రూపొందిస్తోంది. 2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత్ నిర్దేశించుకున్న 280 గిగావాట్ల సామర్ధ్యంలో 35 శాతం.
► రిలయన్స్‌కు పటిష్టమైన ఆర్థిక వనరులు, సంబంధాలు ఉన్నప్పటికీ .. ఈ విభాగంలో విజయం సాధించడానికి అవసరమైన సాంకేతికత, తయారీ నైపుణ్యాలు అంతగా లేవు. కాబట్టి ఇందుకోసం తగిన సంస్థలతో చేతులు కలపాల్సి ఉంటుంది.
► సౌర, బ్యాటరీ ప్లాంట్లు 2024లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 2025 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఇంధన వ్యాపారాల నుంచి రిలయన్స్‌కు
ఆదాయాలు రానున్నాయి.
► 2030 నాటికి సౌర విద్యుత్ టీఏఎం 13 బిలియన్ డాలర్లుగా, హైడ్రోజన్ 10 బిలియన్ డాలర్లు, బ్యాటరీల టీఏఎం 7 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. సోలార్‌లో రిలయన్స్‌కు 8 బిలియన్ డాలర్లు, బ్యాటరీల్లో 3 బిలియన్ డాలర్లు, హైడ్రోజన్ నుంచి 3 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం రావచ్చు.
► సోలార్‌లో 2030 నాటికి రిలయన్స్ 100 గిగావాట్ల స్థాపిత సామరŠాధ్యన్ని సాధించగలదు. అలాగే, బ్యాటరీల మార్కెట్లో 50 గిగావాట్‌పర్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్ధ్యంతో సుమారు 36 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవచ్చు. హైడ్రోజన్ విభాగంలో టీఏఎం 81 గిగావాట్లుగా ఉండనుండగా.. రిలయన్స్ 16 గిగావాట్లతో 19 శాతం వాటా దక్కించుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment