సాక్షి, ముంబై : ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మూలురాయిని చేసుకుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరించింది. రిలయన్స్ టెలికాం విభాగంరిలయన్స్ జియోలోదిగ్గజ సంస్థలపెట్టుబడులతో రిలయన్స్ అధినేతఇప్పటికే ప్రపంచకు బేరులజాబితాలోఇంతింటై వటుడింతై అన్నట్టుగారోజుకో కొత్త శిఖరానికి ఎగబాకుతున్నారు. తాజాగా రిలయన్స్ కూడా మార్కెట్ క్యాప్ పరంగా కొత్త తీరాలకు చేరింది. రిలయన్స్ షేరు ధర ఇటీవల ఆల్‌టైం హైంకి చేరడంతో ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ కార్పొరేషన్‌ను అధిగమించి సౌదీ అరామ్‌కో తరువాత రెండవ స్థానాన్ని సాధించింది.
అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ 8 బిలియన్ డాలర్లను కొత్తగా సాధించడంతో మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎక్సాన్ మొబిల్ 1 బిలియన్ డాలర్లను నష్టపోయింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ సంక్షోభంతో ఇంధన డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రిఫైనర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎక్సాన్ షేర్లు 39 శాతం క్షీణించగా రిలయన్స్ షేర్లు ఈ ఏడాది 43 శాతం పుంజుకోవడం గమనార్హం. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 1.76 ట్రిలియన్ డాలర్లతో అరాంకో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment