ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఈ రంగంలో 2023 సంవత్సరంలో దాదాపు 10,18,800 (1.02 మిలియన్ల) ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఆర్‌ఈఎన్‌ఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ సంఖ్య అనూహ్యంగా 2023లో 16.2 మిలియన్లకు పెరిగింది. మన దేశంలో 2022లో 2,82,200 మందికి కొలువులు వచ్చాయి. 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగి దాదాపు 10,18,800కు చేరింది.
ఒక్క చైనా మినహా ప్రపంచ దేశాలన్నింటి కంటే మన దేశమే ఈ విషయంలో పురోగమనంలో ఉంది. మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 40శాతం మంది మహిళలు ఉండటం విశేషం. – సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment