
రెనర్జీ డైనమిక్స్ (REnergy Dynamics) పునరుత్పాదక రంగంలోకి అడుగుపెట్టినట్లు సోమవారం ప్రకటించింది. కంపెనీ లార్జ్ స్కేల్ బయోఎనర్జీ ప్రాజెక్ట్‌లకు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ రంగానికి, ఫీడ్‌స్టాక్ అగ్రిగేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ మొదలైనవి సంస్థలకు తన ఉత్పతులను విక్రయించనుంది.
రెనర్జీ డైనమిక్స్ 2029 నాటికి వివిధ సంస్థల నుంచి రూ.5000 కోట్ల రూపాయల ఆర్డర్లను బుక్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ వివిధ దశల్లో రూ. 575 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.