
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. తక్షణ రుణ మంజూరీ సేవలను అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మహా లోన్ ధమాకా’ పేరిట ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ఈ క్యాంప్స్ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది.
హ్యుందాయ్ మోటార్స్ వంటి కంపెనీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందం మేరకు కస్టమర్లు కాకపోయినా.. ప్రత్యేక ఆఫర్లతో మేళా వద్ద రుణాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్యాంప్స్ ఉండనున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అనుప్ బాగ్చి పేర్కొన్నారు.