Private Sector Banking
-
ఆకర్షణీయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఫలితాలు
ముంబై: ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేసినప్పటికీ.. బ్యాంకు కన్సాలిడేటెడ్ లాభం 24 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా కరోనా కారణంగా చెల్లింపులు రాకపోవచ్చన్న అంచనాలతోనే రూ.5,550 కోట్లను పక్కన పెట్టింది (ప్రొవిజనింగ్). స్టాండలోన్‌గా చూసుకుంటే (అనుబంధ కంపెనీలను మినహాయించి) బ్యాంకు లాభం 36 శాతం వృద్ధితో రూ.2,599 కోట్లుగా నమోదైంది. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో స్వల్ప వాటాలను విక్రయించడం లాభాల వృద్ధికి దోహదపడింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతానికి పైగా పెరిగి రూ.37,939 కోట్లుగా నమోదైంది. మారటోరియం వినియోగించుకున్న రుణ గ్రహీతల శాతం ఏప్రిల్ చివరికి 30 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 17.5 శాతానికి తగ్గింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ ‘మహా లోన్ ధమాకా’
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. తక్షణ రుణ మంజూరీ సేవలను అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మహా లోన్ ధమాకా’ పేరిట ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ఈ క్యాంప్స్ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది. హ్యుందాయ్ మోటార్స్ వంటి కంపెనీలతో ఏర్పాటుచేసుకున్న ఒప్పందం మేరకు కస్టమర్లు కాకపోయినా.. ప్రత్యేక ఆఫర్లతో మేళా వద్ద రుణాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్యాంప్స్ ఉండనున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అనుప్ బాగ్చి పేర్కొన్నారు. -
విదేశీ పెట్టుబడుల పరిమితులపై నోటిఫికేషన్
న్యూఢిల్లీ : బ్యాంకింగ్, రక్షణ మినహా వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులపై సంయుక్త పరిమితులకు సంబంధించి చేసిన మార్పులు, చేర్పులపై కేంద్రం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కమోడిటీ ఎక్స్చేంజీలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, పవర్ ఎక్స్చేంజీలు మొదలైన వాటిల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల విషయంలో ఉప-పరిమితులేమీ ఉండవు. ఆయా రంగాల్లో పోర్ట్‌ఫోలియో లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అన్నింటికీ కలిపి ఒకే పరిమితి ఉంటుంది. అయితే, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో మాత్రం మొత్తం విదేశీ పెట్టుబడుల పరిమితి 74 శాతంగా ఉండగా, ఇందులో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉప-పరిమితి 49 శాతంగా ఉంటుంది. అలాగే రక్షణ రంగంలోనూ ఆటోమేటిక్ మార్గంలో వచ్చే పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల పరిమితి 24 శాతంగా ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం దాకా విదేశీ పెట్టుబడులకు అనుమతులున్న రంగాలపై ఈ కొత్త పరిమితుల ప్రభావం ఉండబోదని పేర్కొంది. -
యాక్సిస్ లాభం 18% అప్
ఒక్కో షేర్‌కు రూ.4.6 డివిడెండ్ ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 18 శాతం వృద్ధి సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,842 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,181 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,179 కోట్ల నుంచి రూ.12,384 కోట్లకు ఎగసిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు రూ.4.60 (230 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.6,218 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.7,358 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.38,046 కోట్ల నుంచి రూ.43,844 కోట్లకు ఎగసిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 1.22 శాతం నుంచి 1.34 శాతానికి, నికర మొండి బకాయిలు 0.4 శాతం నుంచి 0.44 శాతానికి పెరిగాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 3.1 శాతం వృద్ధితో రూ.552 వద్ద ముగిసింది.