
ముంబై: హ్యుందాయ్ కంపెనీ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వ్యాపార సదస్సులో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. ఇక్కడ జరుగుతున్న భారత కొరియా వ్యాపార సదస్సులో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎస్‌యూవీ నెక్సోను, గ్లోబల్ మోడల్ లోనిక్‌ను ప్రదర్శనకు ఉంచినట్లు హ్యుందాయ్ నమ్‌యాంగ్ ఆర్ అండ్ డీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.హెచ్. కిమ్ చెప్పారు. భారత్‌లో తయారీకి గత 20 ఏళ్లుగా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నామని చెప్పారాయన. సమర్థమైన పర్యావరణ అనుకూల వాహనాలను అందించడంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణను మైలురాయిగా వర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment