ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన పాకిస్థాన్ విభాగం "కాశ్మీర్" వ్యవహారంపై సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో ఆ సంస్థ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. హ్యుందాయ్ "కాశ్మీర్" ట్వీట్ వివాదం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ పాకిస్తాన్ విభాగం కాశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ యూ-యోంగ్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.."విచారం వ్యక్తం చేశారు".
హ్యుందాయ్ పాకిస్తాన్ సోషల్ మీడియా ఫిబ్రవరి 5న "కాశ్మీరీ సోదరుల త్యాగాలను" గుర్తుచేసుకుంటున్నట్లు ఒక పోస్టు పెట్టింది. దీంతో వివాదం మొదలైంది. "రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి హెచ్.ఇ.చుంగ్ యూ-యోంగ్ ఈ ఉదయం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వారు అనేక అంశాలపై చర్చించగా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి కూడా సోషల్ మీడియా పోస్ట్ వల్ల భారత ప్రజలకు, ప్రభుత్వానికి కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని తెలియజేసినట్లు" ఎంఈఏ తన వివరణాత్మక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలోని భారత రాయబారి హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలోని సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరినట్లు ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
Received a call from ROK FM Chung Eui-yong today. Discussed bilateral and multilateral issues as also the Hyundai matter.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 8, 2022
ఇంతలో, న్యూఢిల్లీలోని దక్షిణ కొరియా రాయబారిని కూడా ఎంఈఏ ఈ విషయం గురుంచి పిలిపించి అడిగినది. "కాశ్మీర్ సాలిడారిటీ డేకు మద్దతు తెలుపుతూ హ్యుందాయ్ పాకిస్తాన్ చేసిన సోషల్ మీడియా పోస్టును మేము చూశాము. ఈ సోషల్ మీడియా పోస్ట్ గురుంచి ఆదివారం, 6 ఫిబ్రవరి 2022న, సియోల్'లోని మా రాయబారి హ్యుందాయ్ హెడ్ క్వార్టర్స్ సంప్రదించి వివరణ కొరాము. ఆ వెంటనే సోషల్‌మీడియా నుంచి పోస్ట్‌ను వారు డిలీట్ చేశారు. సోషల్‌మీడియాలో వచ్చిన అనుచితపోస్టుపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించి విషయాల్లో రాజీపడేది లేదని గట్టిగా స్పష్టం చేశాం. దీనిపై కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని అరీందమ్ బాగ్బీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
(చదవండి: గూగుల్ సెట్టింగ్స్‌లో ఈ మార్పు చేస్తే మీ ఖాతా మరింత భద్రం..!)
Comments
Please login to add a commentAdd a comment