ఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం ఉపయోగించి భారత్‌ను అంతర్జాతీయంగా చర్చకు తీసుకురావడమే పాకిస్థాన్ ప్రధాన విధానం అని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. పాక్ దుష్టవైఖరికి భారత్ అడ్డుకట్ట వేయగలిగిందని అన్నారు.
'భారత్‌ను అంతర్జాతీయ వేదికపై చర్చకు తీసుకురావడానికి పాక్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదం మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం అక్కడ ఉగ్రవాదాన్ని చట్టబద్దంగా చేసినట్లు కనిపిస్తోంది. పొరుగుదేశంతో భారత్ ఇలా ఎప్పటికీ వ్యవహరించదు.' అని జైశంకర్ అన్నారు.
కెనడాలో వ్యాపిస్తున్న ఖలిస్థానీల ప్రభావం గురించి కూడా జైశంకర్ మాట్లాడారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయడానికి కెనడాలో ఖలిస్థానీయులకు అవకాశం ఇస్తున్నారని అన్నారు. ఇదే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడానకి కారణమైందని చెప్పారు. ఈ విధానం ఇటు.. భారతదేశానికి గానీ, కెనడాకు గానీ ఉపయోగం కానప్పటికీ ఆ దేశ రాజకీయాలు అలా ఉన్నాయని విమర్శించారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడ్డ జనం
Comments
Please login to add a commentAdd a comment