టాప్‌ హీరోయిన్‌కు షాక్‌ heroine anushka caravan seized in tamil nadu | Sakshi
Sakshi News home page

టాప్‌ హీరోయిన్‌కు షాక్‌

Published Thu, Jun 1 2017 9:44 AM

టాప్‌ హీరోయిన్‌కు షాక్‌

చెన్నై(తమిళసినిమా): హీరోయిన్‌ అనుష్కకు తమిళనాడు అధికారులు షాక్‌ ఇచ్చారు. షూటింగ్‌ కోసం ఆమె ఉపయోగిస్తున్న కారవాన్‌ను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి చిత్రం తరువాత ‘భాగమతి’ సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌  కొద్దిరోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోంది.

అక్కడ హోటల్‌లో బస చేసి ఆ చిత్రంలో నటిస్తున్న నటి అనుష్క షూటింగ్‌ లోకేషన్స్‌కు వెళ్లడానికి కారవాన్‌ను ఉపయోగిస్తోంది. దీనికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేసి ఆర్‌టీఓ కార్యాలయానికి తరలించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో  హర్రర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు రెండు వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement