Allu Arjun Caravan Accident, at Khammam | No Casualties Reported - Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కు ప్రమాదం

Published Sat, Feb 6 2021 5:12 PM | Last Updated on Sat, Feb 6 2021 6:22 PM

Allu Arjun Caravan Falcon Met With Road Accident - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. పుష్ప మూవీ షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్‏ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. సడన్‌ బ్రేక్‌ వేడయంతో వెనుకనుంచి మరో వావాహం వచ్చి ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో అల్లు అర్జున్‌ లేరని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

మరో వైపు ఏజెన్సీ ఏరియాలో షూటింగ్‌ పూర్తయిందంటూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. ‘రంజచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ‘పుష్ప’సినిమాకు సంబంధించి నవంబర్‌ 2020 నుంచి జనవరి 2021 మధ్య రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేశాం. సినిమా షూటింగ్‌కు సహకరించిన ఆదివాసీలు, అధికారులకు ధన్యవాదాలు. వారి సహకారం లేకుండా చిత్రీకరణ సజావుగా సాగేది కాదు. షూటింగ్‌ కోసం మళ్లీ ఇక్కడకు తప్పకుండా వస్తాం’అని చిత్ర యూనిట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్‌–దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement