Luxurious Bungalow To Special Caravan: 5 Most Expensive Things Owned By Allu Arjun - Sakshi
Sakshi News home page

Allu Arjun Expensive Things: వావ్‌.. అల్లు అర్జున్‌ కొత్త ఇల్లు అదిరిందిగా.. ఎన్ని కోట్లు పెట్టాడంటే..

Published Tue, Feb 22 2022 4:05 PM | Last Updated on Thu, Dec 8 2022 12:56 PM

Allu Arjun Rs 100 Crore Bungalow to Rs 7 crore vanity van, 5 Expensive Things Pushpa - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అల్లు అర్జున్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన స్టైలీష్‌ లుక్‌, భిన్నమైన డ్యాన్స్‌, అంతకుమించిన వ్యక్తిత్వం.. ఇలా ప్రతి విషయంలో అందరి కంటే భిన్నంగా ఉంటాడు బన్నీ. అందుకే స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌ ఎదిగాడు. ఇక బన్నీ ఫ్యామిలీ మ్యాన్‌ అనే విషయం తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి టూర్స్‌ ప్లాన్‌ చేస్తాడు. లేదా ఇంట్లోనే పిల్లలతో సరదా సమయాన్ని ఆస్వాదిస్తాడు. ఇక వీలు చిక్కినప్పుడల్లా భార్య పిల్లలతో హైదరాబాద్‌ రోడ్లపై కారులో షికారు కొడుతుంటాడు.

ఇక తన ప్రతి మూవీ ఈవెంట్‌కు కుటుంబంతోనే వస్తాడు బన్నీ. అలాంటి బన్నీ తన ఫ్యాషన్‌లో అయినా లగ్జరీ విషయంలో అయినా ‘తగ్గేదే లే’ అంటాడు. అందుకే అతడు వాడే కాస్ట్యూమ్స్‌ నుంచి కారు బంగ్లాల వరకు అన్ని భిన్నంగా, లగ్జరీగా ఉండేలా చూసుకుంటాడు. అయితే స్టార్‌ హీరో అయిన బన్నీ విలాసవంతమైన కొత్త ఇల్లు ఇటీవల కట్టించుకున్నాడు. పుష్పతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న బన్నీపైనే ఇప్పుడు అందరి ఫోకస్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్ల కలెక్షన్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి అవేంటి? వాటి స్పెషాలిటీ ఏంటో మనం కూడా ఓ సారి చూద్దాం.   

అల్లు అర్జున్‌ వ్యానిటీ వ్యాన్‌ 
బెసిగ్గా బ్లాక్‌ను ఇష్టపడే ఈ ఐకాన్‌ స్టార్‌ వ్యానిటీ వ్యాన్ కారును పూర్తిగా బ్లాక్‌లో ఉండేలా చూసుకున్నాడు. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ వ్యాన్‌ ధర రూ. 7 కోట్లు. ముద్దుగా దీనిని ఫాల్కాన్‌ అని పిలుచుకుంటాడట బన్నీ. ఈ వ్యాన్‌లో భారీ టీవీ సెట్, ఫ్రిజ్‌తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ అమర్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.  దీనిపై ముందులో భాగంగా ఫాల్కోన్‌ అని రాసి ఉండగా.. ఇరువైపు ఏఏ(AA) ఉంటుంది. 

2 ఎకరాల్లో 100 కోట్లతో  విలాసవంతమైన బంగ్లా!
సింప్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి ఉండడం సహజం. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి పేరు 'బ్లెస్సింగ్'. రెండు ఎకరాల స్థలంలో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో విలాసవంతంగా అల్లు అర్జున్ ఈ ఇంటిని తన టేస్ట్‌కు తగ్గట్టుగా నిర్మించుకున్నాడు. పూర్తిగా సహజమైన తెలుపు రంగుతో పెయింటింగ్‌ చేసిన ఈ ఇంటి లోపల పెద్ద స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌, హోమ్‌ థియేటర్‌, స్పెషల్‌ పార్టీల కోసం బార్‌ జోన్‌, పిల్లల కోసం ప్లేయింగ్‌ ఏరియా ఉంది. 

రేంజ్ రోవర్ వోగ్
అల్లు అర్జున్‌ అత్యంత ఇష్టంగా కొనుక్కున్న ఖరీదైన లగ్జరీ కారు రేంజ్ రోవర్ వోగ్, బన్నీ విలువైన ఆస్తులలో ఇది కూడా ఒకటి. బన్నీ ఈ కారు ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఇంట్లో కొత్త కారు. నేను దానికి బీస్ట్‌ అని పేరు పెట్టాను. నేను ఏదైనా ప్రత్యేకమైన దానిని కొన్న ప్రతిసారి నా మనసులో ఒకటే ఉంటుంది. అది కృతజ్ఞత’ అంటూ రాసుకొచ్చాడు. ఈ రేంజ్‌ రోవర్‌ కారు ఖరీదు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. 

హమ్మర్‌ హెచ్‌2
బన్నీ ఖరీదైన కారు కలెక్షన్స్‌లో ఇది ఒకటి. దీని ధర రూ. 75 లక్షలకు పైగా ఉంటుంది. దీనిని అల్లు అర్జున్‌ ఎంతో ఇష్టంగా తన తొలి సంపాదనతో కొనుగొలు చేశాడట. ఈ కారులోనే బన్నీ ఎక్కువగా భార్య, పిల్లలతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళుతుంటాడని సమాచారం. 

రెడ్‌ మెర్సిడేజ్‌ 200 సీడీఐ
ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర 31 లక్షల రూపాయలు. ఎక్కువ బన్నీ ఈ కారులోనే ఫ్యామిలీతో కలిసి షికార్లకు వెళుతుంటాడట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement