ఏడుకోట్ల క్యారవాన్‌? | Allu Arjun's new Rs 7 crore caravan | Sakshi
Sakshi News home page

ఏడుకోట్ల క్యారవాన్‌?

Published Mon, Mar 25 2019 12:06 AM | Last Updated on Mon, Mar 25 2019 12:06 AM

Allu Arjun's new Rs 7 crore caravan - Sakshi

అల్లు అర్జున్‌

డ్యాన్స్‌ అయినా...లుక్స్‌ పరంగా అయినా...స్టైలింగ్‌ విషయంలో హీరో అల్లు అర్జున్‌ తనదైన శైలిలో ప్రత్యేకతను చూపుతూ స్టైలిష్‌స్టార్‌ అని అనిపించుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్‌ ఏడుకోట్ల రూపాయల ఖర్చుతో ఓ స్పెషల్‌ క్యారవాన్‌ను సిద్ధం చేయిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వచ్చాయి. సెట్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు సీన్‌ గ్యాప్‌లో యాక్టర్స్‌ సేదతీరేది క్యారవాన్స్‌లోనే. అంతేకాదు.. అల్లు అర్జున్‌ రెడీ చేయిస్తున్న ఈ క్యారవాన్‌లోని లోపలి డిజైన్‌ను డెకరేట్‌ చేయడానికి ముంబై నుంచి ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌కు కబురు పెట్టారట. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే, సుకుమార్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు అల్లు అర్జున్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement