పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. ఫ్యామిలీతో కలిసి ప్రకృతిలో విహరించేందుకు చాలా మంది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళాకి వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కేరవాన్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది కేరళా టూరిజం శాఖ.
కేరవాన్ టూరిజం రోజురోజుకి చాలా పాపులర్ అవుతోంది. సాధారణంగా టూర్‌కి వెళ్లే పర్యటకులకు వివిధ ప్రదేశాల్లో చూడదగ్గ ప్రదేశాలు ఎంత బాగున్నా.. మౌలిక సదుపాయల కొరత అనే సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు.. టూరిస్టులు మరింత అహ్లాదంగా తమ పర్యటన ఎంజాయ్ చేసేందుకు వీలుగా కేరవాన్ కాన్సెప్టును విస్తృతం చేస్తోంది కేరళా టూరిజం శాఖ.
కేరవాన్ టూరిజంలో భాగంగా కస్టమైజ్ వాహనాలు అందుబాటులో ఉంచుతోంది. ఇందులో బాత్‌రూం, బెడ్‌రూం, కిచెన్, గీజర్, మినీ ఫ్రిడ్జ్ , సోఫా, రిక్లెయినర్, ఫోల్డబుల్ టేబుల్, వైఫైతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్.. ఇలా ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. టూరిస్టులు తమ అభిరుచికి తగ్గట్టుగా వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు.
ప్రభుత్వ నియమ నిబంధనలు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కేరవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఆ రాష్ట్ర టూరిజం డైరెక్టర్ వీఆర్ కృష్ణ తేజ తెలిపారు. కనీసం యాభై ఎకరాల స్థలం, ఐదు కేరవాన్లు సర్థుబాటు చేయగలిగిన వారికి ఇందులో భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక ప్రముఖ సంస్థలు ఈ టూరిజం ప్లాన్స్ ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు.
కేరవాన్ టూరిజానికి ఫ్యామిలీలతో పాటు హనీమూన్ జంటల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. కేరవాన్ టూరిజంలో ఉండే సదుపాయాలు, సేఫ్టీ కారణంగా హానీమూన్ జంటలు ఈ ప్యాకేజీ ఎంచుకుంటున్నాయని తెలిపారు. దీంతో ఫ్యామిలీలతో పాటు కపుల్స్ కోసం హైబ్రిడ్ టూరిజం ప్లాన్స్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. కేరళా పల్లెలు, బ్యా్‌క్ వాటర్ ల్యాండ్ స్కేప్స్, సుగంధ ద్రవ్యాల తోటల్లో విహరించేందుకు ఇదో చక్కని అవకాశం అంటోంది కేరళా టూరిజం శాఖ.(అడ్వెటోరియల్)
Comments
Please login to add a commentAdd a comment