Kerala Tourism
-
ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు గెలుపొందిన కేరళ టూరిజం
కేరళ రాష్ట్రంలోని పర్యాటక శాఖకు ప్రత్యేకస్థానం ఉంది. సమష్టిగా పనిచేసి ఏకంగా ప్రపంచ అవార్డులు సొంతం చేసుకుంటుంది. అక్కడి ప్రజలు, ప్రభుత్వ విధానంలో మరింత స్ఫూర్తి నింపుతుంది. ఓ జీవన గమనంలో ఉండేంతటి ఆశయాలూ, సవాళ్లూ, అన్నింటికన్నా మానవీయ కోణాలూ, స్థానిక ప్రజల ఆర్థిక ప్రమాణాలు... వేలాది మంది సమష్టి కృషితో సాధించుకున్న కేరళ పర్యాటకు శాఖ ఆచరణీయం అవుతుంది. ఫలితంగా..రాష్ట్ర బాధ్యతాయుత టూరిజం మిషన్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికిగాను కేరళ ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు’ని కైవసం చేసుకుంది. నాటి భారతదేశం అంతటా అంటరానితనం ఉన్నా..కేరళలో ఆ దురాచారం మరీ ఎక్కువ. ఆ నేపథ్యంలోనే నారాయణగురు అనే ఆధ్యాత్మికవేత్త స్థానికంగా ఎన్నో సంఘసంస్కరణల్ని తీసుకొచ్చాడు. విద్యా సంస్థల్ని నెలకొల్పాడు. ఆయన ప్రభావంతో చైతన్యం పొందిన ఎందరో నేతలు అరవై ఏళ్ళలో అటు రాజకీయంగానూ, ఇటు సాంస్కృతికంగానూ కేరళ పునర్వికాసానికి కారణమయ్యారు. వాళ్ళే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్టు పార్టీల్లో చేరారు. పాలన ఎవరిదైనా సరే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. అందరికీ సమాన విద్యావకాశాలతో 1980 నాటికే 91 శాతం అక్షరాస్యతని సాధించారు. ఇవన్నీ బాగానే ఉన్నా..ఆర్థికాభివృద్ధిలో మాత్రం ఆ రాష్ట్రానిది వెనకంజే. ఓ వైపు ఎత్తైన కొండలూ దట్టమైన అడవులూ, మరోవైపు సముద్రం, మంచినీటి కాలువలు వీటి మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ కాబట్టి కేరళలో భారీ పరిశ్రమల నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. సుగంధద్రవ్యాల ఎగుమతి, చేపలు పట్టడం, ఆ పరిశ్రమకి కావాల్సిన తాళ్ళు పేనడం..ప్రజల ఉపాధికి ఇవే శరణ్యమయ్యాయి. చదువుకున్న యువతీయువకులు ఇతర దేశాలకు వలస వెళ్ళడం పెరిగింది. 1980 నాటి కేరళ పరిస్థితి ఇది. దాన్ని మార్చి..ఆర్థిక అభివృద్ధిని సాధించాలనుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు వాళ్ళకి కనిపించిన ఏకైక అవకాశం పర్యటకం. నాటి నుంచి నేటి వరకు పర్యాటకం పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. స్థానిక ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు గణనీయమైన ప్రయోజనాలను సమకూరుస్తున్నారు. దానికితోడు ప్రకృతిని, తరాలుగా వస్తున్న వారసత్వ సంపదను పరిరక్షించడంలో సహాయపడుతున్నారు. ఫలితంగా ఎన్నో ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంటున్నారు. దాంతోపాటు ఆర్థికంగా పుంజుకుంటున్నారు. తాజాగా గెలుపొందిన గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్టనర్షిప్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం (ఐసీఆర్టీ), బెస్ట్ ఫర్ లోకల్ సోర్సింగ్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. మహిళల నేతృత్వంలోని చిన్న, మధ్య తరహా సంస్థలను పర్యాటక కార్యకలాపాలకు అనుసంధానించారు. స్వదేశీ ఉత్పత్తులనే మార్కెటింగ్ చేశారు. అందుకు రాష్ట్ర మిషన్ సమ్మిళిత పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దాంతో అత్యంత విలువైన అవార్డును సొంతం చేసుకున్నారు. కేరళ టూరిజం ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి. 2019లో ఆదాయం: రూ.45,010.69 కోట్లు(కరోనా ముందు) 2020లో ఆదాయం: రూ.11వేలకోట్లు 2021లో ఆదాయం: రూ.12285 కోట్లు 2022లో ఆదాయం: రూ.35168 కోట్లు రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం: 10 శాతం 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య: 1.83 కోట్లు 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు: 12లక్షల మంది 2019లో రాష్ట్ర విదేశీ మారకపు ఆదాయం: సుమారు రూ.10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ 2030’ ద్వారా మరింత ప్రోత్సహం అందిస్తుంది. ఈ మిషన్ ప్రకారం 2030 వరకు రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 12-20 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నారు. -
దేశ పర్యాటకానికి కేరళ ఎంతో కీలకం: మోదీ
-
కేరళా స్పెషల్.. కేరవాన్ టూరిజం..
పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. ఫ్యామిలీతో కలిసి ప్రకృతిలో విహరించేందుకు చాలా మంది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళాకి వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కేరవాన్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది కేరళా టూరిజం శాఖ. కేరవాన్ టూరిజం రోజురోజుకి చాలా పాపులర్ అవుతోంది. సాధారణంగా టూర్‌కి వెళ్లే పర్యటకులకు వివిధ ప్రదేశాల్లో చూడదగ్గ ప్రదేశాలు ఎంత బాగున్నా.. మౌలిక సదుపాయల కొరత అనే సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు.. టూరిస్టులు మరింత అహ్లాదంగా తమ పర్యటన ఎంజాయ్ చేసేందుకు వీలుగా కేరవాన్ కాన్సెప్టును విస్తృతం చేస్తోంది కేరళా టూరిజం శాఖ. కేరవాన్ టూరిజంలో భాగంగా కస్టమైజ్ వాహనాలు అందుబాటులో ఉంచుతోంది. ఇందులో బాత్రూం, బెడ్రూం, కిచెన్, గీజర్, మినీ ఫ్రిడ్జ్ , సోఫా, రిక్లెయినర్, ఫోల్డబుల్ టేబుల్, వైఫైతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్.. ఇలా ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. టూరిస్టులు తమ అభిరుచికి తగ్గట్టుగా వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కేరవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఆ రాష్ట్ర టూరిజం డైరెక్టర్ వీఆర్ కృష్ణ తేజ తెలిపారు. కనీసం యాభై ఎకరాల స్థలం, ఐదు కేరవాన్లు సర్థుబాటు చేయగలిగిన వారికి ఇందులో భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక ప్రముఖ సంస్థలు ఈ టూరిజం ప్లాన్స్ ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. కేరవాన్ టూరిజానికి ఫ్యామిలీలతో పాటు హనీమూన్ జంటల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. కేరవాన్ టూరిజంలో ఉండే సదుపాయాలు, సేఫ్టీ కారణంగా హానీమూన్ జంటలు ఈ ప్యాకేజీ ఎంచుకుంటున్నాయని తెలిపారు. దీంతో ఫ్యామిలీలతో పాటు కపుల్స్ కోసం హైబ్రిడ్ టూరిజం ప్లాన్స్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. కేరళా పల్లెలు, బ్యా్క్ వాటర్ ల్యాండ్ స్కేప్స్, సుగంధ ద్రవ్యాల తోటల్లో విహరించేందుకు ఇదో చక్కని అవకాశం అంటోంది కేరళా టూరిజం శాఖ.(అడ్వెటోరియల్) -
కర్ణాటకలో రాజకీయ కాక : కేరళ కూల్ ట్వీట్
తిరువనంతపురం : అసలకే వేసవి తాపం, ఆపై కర్ణాటక ఎన్నికల ఫలితాలు. రాజకీయ నేతల్లో మరింత వేడిమి రాజుకుంది. ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠను రేపిన ఈ ఫలితాలు, చివరికి ఎవరికీ స్పష్టమైన మెజార్టీని అందించకుండా మరింత కాకను పుట్టించాయి. దీంతో కాంగ్రెస్, జేడీయూలు కలిసి పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని బీజేపీ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కోరింది. దీంతో కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేయకుండా గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించాలని జేడీఎస్ వ్యూహాం రచిస్తోంది. కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తోంది. ఈ రాజకీయ సమీకరణాలతో కర్ణాటక కాక పుట్టిస్తుంటే, దాని పక్కనే ఉన్న రాష్ట్రం కేరళ కర్ణాటక రాజకీయ నేతలకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. సాక్షాత్తూ దేవుళ్ల సొంత రాష్ట్రమైన కేరళ రిసార్ట్స్‌లో బస చేసి సేద తీరండని ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటనతో గెలిచిన ఎమ్మెల్యేలకు బసతో పాటు తన వ్యాపార లబ్దిని చూసుకుంటోంది. తమ వద్ద అత్యంత సురక్షితమైన, అద్భుతమైన రిసార్ట్స్ ఉన్నాయని, ఎమ్మెల్యేలు ఇక్కడికి రావొచ్చని కేరళ టూరిజం ట్వీట్ చేసింది. ఇక్కడికి వచ్చి రాజకీయ గేమ్ ఆడుకోవాల్సిందిగా కూడా అంటోంది. కర్ణాటక రాజకీయ నేతలకు కేరళ టూరిజం ప్రకటించిన ఈ వినూత్న ఆఫర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. కేరళం టూరిజం చేసిన ఈ ట్వీట్ ట్విటర్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాల సందర్భంగా చూసిన బెస్ట్ ట్వీట్ ఇదే అంటూ ఓ ట్విటర్ యూజర్ కామెంట్ పెట్టారు. గాడ్స్ ఓన్ ట్వీట్‌గా మరో యూజర్ కామెంట్ పెట్టారు. ఇలా కేరళ టూరిజం ట్వీట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. After the rough and tumble of the #KarnatakaVerdict, we invite all the MLAs to unwind at the safe & beautiful resorts of God's Own Country. #ComeOutAndPlay pic.twitter.com/BthNZQSLCC — Kerala Tourism (@KeralaTourism) May 15, 2018 Gods own tweet. — Movies Dialogues (@MoviesDialogues) May 15, 2018 Award for this 🙏 u guys rock. — Sweekruth B.P (@SweekruthBP) May 15, 2018 -
కొత్త వేదికలతో కేరళ టూరిజం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏటా అయిదారు కొత్త ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నట్టు కేరళ టూరిజం వెల్లడించింది. ప్రస్తుతం 100కుపైగా కేంద్రాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కె.పి.నందకుమార్ తెలిపారు. టూర్ ఆపరేటర్లు, ఏజెన్సీలతో కేరళ టూరిజం రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైల్డ్‌లైఫ్, హిల్ స్టేసన్స్, బీచెస్, బ్యాక్‌వాటర్స్ వంటివి ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల వారు వివాహాలను కేరళలో జరపడం పెరుగుతోందని అన్నారు. ఇటువంటివి ఏటా 500లకుపైగా జరుగుతున్నాయని తెలిపారు. గతేడాది 10 లక్షల మంది విదేశీ, 1.35 కోట్ల మంది దేశీయ పర్యాటకులు కేరళలో అడుగు పెట్టారని చెప్పారు. 2015తో పోలిస్తే గతేడాది సెప్టెంబరులో పర్యాటకుల సంఖ్య 5–6 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. విభిన్న పర్యాటక ప్రదేశాలతో టూరిస్టుల సంఖ్య పరంగా దేశంలో కేరళ తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు.