Heroine Anjali Says I Cried In Caravan After Acting Intimate Scenes Which Crossed The Lines - Sakshi
Sakshi News home page

Anjali: 'ఇష్టం లేని వ్యక్తితో అలాంటి సీన్స్‌ చేయడం అంటే చాలా ఇబ్బంది'.. అంజలి ఎమోషనల్‌

Published Fri, Dec 30 2022 1:49 PM | Last Updated on Fri, Dec 30 2022 5:29 PM

I Cried In Caravan After Acting Intimate Scenes Says Heroine Anjali - Sakshi

తెలుగుమ్మాయి అయినప్పటికీ తమిళనాట మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అంజలి ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి ముద్దుసీన్లు, ఇంటిమేట్‌ సీన్లలో నటించడం గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. 'కొన్నిసార్లు పాత్రకు తగ్గట్లు ముద్దుసీన్లలో నటించాల్సి వస్తుంది. మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బందే. ఇక కొన్నిసార్లు ఇంటిమేట్‌ సీన్లలో నటించినప్పుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సీన్‌ పండటం కోసం నటించాల్సి వస్తుంది' అంటూ ఎమోషనల్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement