
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడని సదరు మహిళా ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారిలో ఉన్న ప్రియాంత్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రియాంత్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చగా.. హీరో మొహం చాటేశాడు. అంతేకాదు అబార్షన్ కోసం మెడిసిన్ ఇవ్వడంతో బాధితురాలు ఆరోగ్యం పాడైపోయింది. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించడంతో.. ప్రాణభయంతో జులై 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారిలో ఉన్న నిందితుడిని .. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment