యూసుఫ్‌గూడలోని జానకమ్మ తోటలో సోమవారం ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది.
బంజారాహిల్స్ (హైదరాబాద్): యూసుఫ్‌గూడలోని జానకమ్మ తోటలో సోమవారం ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది. ఓ శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానిక మెకానిక్ ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
నెలలు నిండకుండానే శిశువును గర్భస్రావం ద్వారా తొలగించుకోవడం వల్ల మృతి చెంది ఉంటుందని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.