
మృతి చెందిన పిల్లి
విశాఖపట్నం,సీతమ్మధార(విశాఖ ఉత్తర): కొట్టడంతో పిల్లి మృతి చెందినట్లు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రైల్వే న్యూ కాలనీలోని రేవతి టవర్స్‌లో ప్లాట్ నంబర్ 306లో నివాసం ఉంటున్న కటారి యశోద పిల్లిని పెంచుకుంటున్నారు. రేవతి టవర్స్‌లో గల 402 ప్లాట్‌లో ఉన్న వారు తన పిల్లిని కొట్టినట్లు ఆమె విశాఖ సొసైటీ ప్రొటక్షన్ అండ్ కేర్ ఆప్ యానిమల్స్ సంస్థకు చెందిన పొట్నూరి శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన శ్రీదేవి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఎస్‌ఐ భువనేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన పిల్లిని పోస్టుమార్టం కోసం వెటర్నరీ ఆస్పత్రికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment