సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలంటూ కమ్యూనిస్ట్ నేతలు డీజీపీని కలిశారు. కొన్ని నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేస్‌లో చింతమనేనిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ, సీపీఎం నాయకుడు వైవీ, న్యూడెమోక్రసి నేతలు నెల్లిమర్ల ప్రసాద్, డేగా ప్రసాద్‌లు డీజీపీని కలిసి.. చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరారు.
అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అండ చూసుకునే చింతమనేని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుతున్నారంటూ ఆరోపించారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు
Comments
Please login to add a commentAdd a comment